Vijay Deverakonda: తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన 'ఖుషి' కలెక్షన్స్ !

ABN , First Publish Date - 2023-09-08T11:25:57+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయాయి అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లేదా నష్టాలతో ముగుస్తుందని అంటున్నారు

Vijay Deverakonda: తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన 'ఖుషి' కలెక్షన్స్ !
A still from Khushi

విజయ్ దేవరకొండ (VijayDeverakonda), సమంత (Samantha) జంటగా నటించిన 'ఖుషి' #Khushi సినిమా గత వారం విడుదలైంది. 'లైగర్' #Liger ఫ్లాపు అవటంతో ఒక పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవేరకొండకి ఈ సినిమా కొండంత ఆశ ఇచ్చింది. అలాగే 'శాకుంతలం' #Shaakuntalam సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో సమంత కూడా ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ (ShivaNirvana) కూడా ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశించాడు. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు కలెక్షన్స్ అదరగొట్టిందనే చెప్పాలి.

ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా లాభాల దిశగా వెళ్ళింది, అలాగే తమిళ నాడు, ఇతర ప్రాంతాల్లో కూడా సినిమా కలెక్షన్స్ బాగానే వున్నాయి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వ్యాపారం రెండు రాష్ట్రాల్లో సుమారు రూ.40 కోట్ల వరకు జరిగిందని, కానీ ఈ సినిమా ఇంతవరకు కేవలం రూ. 22 కోట్లు మాత్రమే కలెక్టు చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్టు చేసిందో, అదే బెస్ట్ అని అంటున్నారు, ఆ తరువాత కలెక్షన్స్ బాగా పడిపోయాయని అంటున్నారు.

khushi-team1.jpg

అయితే 'లైగర్' సినిమా తరువాత పెద్ద హిట్ కోసం చూస్తున్న విజయ్ దేవరకొండ కి ఈ సినిమా అతను అనుకున్నంత ఫలితం ఇవ్వకపోవచ్చు అనే అంటున్నారు. దానికి తోడు ఈ వారం షా రుఖ్ ఖాన్ (ShahRukhKhan), అట్లీ (Atlee) కాంబినేషన్ లో వచ్చిన 'జవాన్' #Jawan చాలా పెద్దగా విడుదలైంది, అలాగే నవీన్ పోలిశెట్టి (NaveenPolishetty), అనుష్క (Anushka) నటించిన 'మిస్ శెట్టి మిష్టర్ శెట్టి' #MissShettyMrPoliShetty సినిమా కూడా విడుదలై చాలా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. 'జవాన్' కూడా పైసా వసూల్ సినిమా అంటున్నారు, అందుకని 'ఖుషి' కలెక్షన్స్ మరి పెరిగే అవకాశం లేదని అంటున్నారు. అందువల్ల విజయ్ దేవరకొండ, సమంత లు తాము అనుకున్నట్టుగా ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వలేకపోయిందనే అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్స్.

ఇది కూడా చదవండి:

Miss Shetty Mr Polishetty film review: తల్లి కావటానికి ప్రెగ్నంట్ కావాలి కానీ, పెళ్ళెందుకు...

Jawan film review: షారుఖ్ ఖాన్ షో ఇది, పైసా వసూల్ సినిమా

Updated Date - 2023-09-08T11:25:57+05:30 IST