Nikhil: తండ్రి కాబోతున్న.. మరో యువ హీరో..

ABN , First Publish Date - 2023-11-13T17:00:43+05:30 IST

టాలీవుడ్‌లో మ‌రో జంట త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. ఆ మ‌ధ్య రామ్‌చ‌రణ్‌, ఉపాస‌న జంట త‌ల్లిదండ్రులవ‌గా నిన్న గాక మొన్న శ‌ర్వానంద్ తండ్రి కాబోతున్నాడ‌నే విష‌యం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవ‌గా అది అలా ఉండ‌గానే తాజాగా ఇప్పుడు మ‌రో హీరో నిఖిల్ కూడా తండ్రి కాబోతున్న‌డ‌నే వార్త‌లు అంత‌టా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Nikhil: తండ్రి కాబోతున్న.. మరో యువ హీరో..
nikhil

టాలీవుడ్‌లో మ‌రో జంట త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. ఆ మ‌ధ్య రామ్‌చ‌రణ్‌, ఉపాస‌న జంట త‌ల్లిదండ్రులవ‌గా నిన్న గాక మొన్న శ‌ర్వానంద్ తండ్రి కాబోతున్నాడ‌నే విష‌యం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది. అది అలా ఉండ‌గానే తాజాగా ఇప్పుడు మ‌రో హీరో నిఖిల్ (Nikhil) కూడా తండ్రి కాబోతున్నాడ‌నే వార్త‌లు అంత‌టా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

NIKHIL A.jpg

2020 క‌రోనా స‌మ‌యంలో తీవ్ర ఆంక్ష‌ల మ‌ధ్య‌ త‌ను ప్రేమించిన డాక్ట‌ర్ ప‌ల్ల‌విని పెళ్లిచేసుకుని అప్ప‌ట్లో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచాడు హీరో నిఖిల్‌. పెళ్లైన నాలుగేండ్ల త‌ర్వాత‌ ఈ జంట నుంచి ఇప్పుడు ఓశుభవార్త వినిపించింది.

ఇటీవల ఈ జంట ఓ శుభ‌ కార్య‌క్ర‌మంలో పాల్గొనగా అక్క‌డ‌ ప‌ల్ల‌వి బేబీ బంప్‌తో క‌నిపించడంతో నిఖిల్ తండ్రి కాబోతున్నాడ‌నే వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. ఈ విష‌యం నిఖిల్ గానీ ఆయ‌న కుటుంబ స‌భ్యులు గానీ అధికారికంగా దృవీక‌రించ‌క పోయిపన‌ప్ప‌టికీ ఈ న్యూస్ అన్నీ సోష‌ల్ ఫ్లాట్‌పామ్‌ల‌లో ట్రెండింగ్ అవుతున్న‌ది.


2007లో హ్యాపీడేస్ చిత్రంతో ఓ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిళ్ ఆ త‌ర్వాత ప‌రశురాం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన యువ‌త సినిమాతో ఫ‌స్ట్ హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత స్వామి రారా, కార్తికేయ అంటూ సెల‌క్టివ్‌గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ విజ‌యాలు సాధించగా.. 2022లో కార్తికేయ‌2తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ త‌ర్వాత‌ వ‌చ్చిన స్పై తీవ్రంగా నిరాశ ప‌ర్చిన నిఖిల్ త్వ‌ర‌లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న‌ స్వ‌యంభూ అనే పిరియిడిక‌ల్ డ్రామా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

Updated Date - 2023-11-13T17:03:20+05:30 IST