Kajal : నెటిజన్ల కామెంట్లు... అయినా తగ్గేదేలే..!

ABN , First Publish Date - 2023-04-03T10:27:26+05:30 IST

హీరోయిన్‌గా అగ్రస్థానంలో ఉన్న ఏ నటి అయినా వైవాహిక జీవితంలోకి అడుగుపెడితే ఆ నటి కెరీర్‌ అంతే అంటారు. ఆ తర్వాత అక్కా, వదిన పాత్రలే అంటూ కామెంట్లు చేస్తారు.

Kajal : నెటిజన్ల కామెంట్లు... అయినా తగ్గేదేలే..!

హీరోయిన్‌గా అగ్రస్థానంలో ఉన్న ఏ నటి అయినా వైవాహిక జీవితంలోకి అడుగుపెడితే ఆ నటి కెరీర్‌ అంతే అంటారు. ఆ తర్వాత అక్కా, వదిన పాత్రలే అంటూ కామెంట్లు చేస్తారు. కొందరు తారలైతే వయసుకు తగ్గ పాత్రలు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటారు. కానీ కాజల్‌ (kajal) మాత్రం తగ్గేదేలే (thaggedele) అంటున్నారు. 2020 అక్టోబర్‌లో కాజల్‌ గౌతమ్‌ కిచ్లూని పెళ్లి చేసుకున్నారు. ఏడాది తిరిగేలోపు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ రెండేళ్లు పెళ్లి, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నా.. ఆమె సినిమాలకు కొంత గ్యాప్‌ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారారు. కొన్ని నెలల క్రితమే బాడీ ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె ‘ఇండియన్‌ 2’(Indian 2), ఎన్‌బీకే 108’ (Nbk 108) చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆమె బాలకృష్ణ సినిమా సెట్‌లో అడుగుపెట్టారు. మరోవైపు ఇండియన్‌ 2 చిత్రీకరణలోనూ భాగమవుతున్నారు.

తాజాగా కాజల్‌పై ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలతో పాటు మరిన్ని అవకాశాలు అందుకునేందుకు గ్లామర్‌ను ఆసరాగా చేసుకుంటుందని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. అందుకు కారణం ఈ మధ్యకాలంలో కాజల్‌ పోస్ట్‌ చేసిన ఫొటోలు. ఇటీవల ఓ కార్యక్రమానికి తన భర్తతో కలిసి హాజరైన కాజల్‌ తనదైన శైలిలో అందాలను ఆరబోశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీనితో పెళ్లై, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా కాజల్‌ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి సినిమాల్లో గ్లామర్‌కు కాజల్‌ సై (kajal ready for glamour roles) అంటుందా.. లేక సంప్రదాయ పాత్రల్లో నటిస్తుందా అన్నది చూడాలి.

Updated Date - 2023-04-03T10:43:13+05:30 IST