KajalAggarwal: ఏంటి అతడిని అలా ముద్దు పెట్టేసుకుంది

ABN , First Publish Date - 2023-05-13T12:42:02+05:30 IST

కాజల్ అగర్వాల్ ఇప్పుడు మరీ బిజీ అయిపొయింది. ఒకపక్క సినిమాలు, మరో పక్క కుటుంబం, అంటే భర్త, కొడుకు, ఇలా బిజీ గా వున్న కాజల్ ఇప్పుడు వ్యాపార రంగం లోకి కూడా అడుగుపెట్టింది. అదే సమయంలో ఆమె...

KajalAggarwal: ఏంటి అతడిని అలా ముద్దు పెట్టేసుకుంది

కాజల్ అగర్వాల్ (KajalAggarwal) పెళ్లికి ముందు ఎంత చలాకీగా వుందో, పెళ్లి తరువాత కూడా అంతే చలాకీగా ఉంటోంది. బాబు పుట్టిన తరువాత, బరువు తగ్గి, సినిమాలు కూడా కొత్తవి చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్. ఆమె ఇప్పుడు రెండు మూడు సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉండటమే కాకుండా, ఇప్పుడు వ్యాపారరంగంలోకి కూడా అడుగు పెట్టి, అక్కడ కూడా బిజీ గా ఉంటోంది. ఆమె తన భర్త గౌతమ్ కిచ్లు (GautamKitchlu) తో కలిసి ఈ వ్యాపార రంగం లోకి అడుగుపెట్టారు.

kajalaggarwal1.jpg

అయితే కాజల్ కుటుంబానికి వ్యాపారం ఏమి కొత్తకాదు, కాజల్ తండ్రి టెక్స్టైల్ రంగంలో వున్నాడు. అలాగే కాజల్ చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్ గా కూడా పని చేసింది. ఇప్పుడు ఆమె 'కాజల్ బై కాజల్' (కాటుక) (Kajal By Kajal) అనే ప్రోడక్ట్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఆమె తన భర్త వెనకాల నుండి నడిపించాడని, అతను లేకపోతే ఇది అసాధ్యం అని చెపుతూ, ఈ లాంచ్ కార్యక్రమం లో తన భర్తని గట్టిగా హత్తుకొని ముద్దుపెట్టుకుంది కాజల్. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది, సాంఘీక మాధ్యమంలో.

kajalaggarwal.jpg

కాజల్ అగర్వాల్ ఇప్పుడు కమల్ హాసన్ (KamalHaasan)తో 'ఇండియన్ 2' (Indian2) సినిమాలో నటిస్తోంది. దీనికి శంకర్ (Shankar) దర్శకుడు. అలాగే బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు అనిల్ రావిపూడి (AnilRavipudi) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది. ఇవి కాకుండా ఇంకో రెండు తమిళ సినిమాలు, అలాగే ఒక హిందీ సినిమా కూడా చేస్తోంది కాజల్. ఈమెకి సంవత్సరం పైబడ్డ ఒక చిన్న బాబు కూడా వున్నాడు.

Updated Date - 2023-05-13T13:06:02+05:30 IST