కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jithender Reddy: ‘జితేందర్‌ రెడ్డి’ ఎవరో తెలిసేది అప్పుడే..

ABN, First Publish Date - 2023-09-18T19:51:49+05:30

రీసెంట్‌గా ‘జితేందర్‌ రెడ్డి’ అనే పోస్టర్‌ సోషల్‌ మీడియాలో ఎంతగా హల్‌చల్‌ చేసిందో తెలిసిందే. హీరో ఎవరో రివీల్‌ చేయకుండా ఇమ్మెన్స్‌ లుక్‌తో వదిలిన పోస్టర్‌తోనే సినిమాపై ఆసక్తి రేకెత్తించారు దర్శకుడు విరించి వర్మ. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని సెప్టెంబర్ 21న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Jithender Reddy Movie Pic

రీసెంట్‌గా ‘జితేందర్‌ రెడ్డి’ (Jithender Reddy) అనే పోస్టర్‌ సోషల్‌ మీడియాలో ఎంతగా హల్‌చల్‌ చేసిందో తెలిసిందే. హీరో ఎవరో రివీల్‌ చేయకుండా ఇమ్మెన్స్‌ లుక్‌తో వదిలిన పోస్టర్‌తోనే సినిమాపై ఆసక్తి రేకెత్తించారు దర్శకుడు విరించి వర్మ (Virinchi Varma). హిజ్‌(హిస్టరీ) స్టోరీ నీడ్స్‌ టు బీ టోల్డ్‌ అనే ట్యాగ్‌లైన్‌ కూడా అంతే ఆసక్తి కలిగించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి 29 సెకెన్ల ఓ గ్లింప్స్‌ వీడియోని మేకర్స్ వదిలారు. ఈ వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలకు సంబంధించిన వివరాలను చిత్రయూనిట్ రివీల్ చేసింది.

‘జితేందర్‌ రెడ్డి అనే నేను ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న నా దేశ గౌరవాన్ని కాపాడతానని, ఈ చరిత్ర నుంచి పుట్టిన సనాతన ధర్మ రక్షణ కోసం భరతమాత ఒడిలో నా ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని, అమరుల రక్తంతో తడిచిన ఈ మట్టి మీద ప్రమాణం చేస్తున్నాను.. జైహింద్‌’ అంటూ సాగిన వాయిస్‌ ఓవర్‌ చిత్రంపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. అసలు ఎవరు ఈ జితేందర్‌రెడ్డి అంటూ చర్చలు మొదలయ్యాయి? ‘ధీరుడు ఒక్కసారే మరణిస్తాడు కాని పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు’ అంటూ ఆసక్తి పెంచుతున్న ఈ షార్ట్ వీడియో సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. (Jithender Reddy First Look Launch Details)


‘ఉయ్యాల జంపాల, మజ్ను’ లాంటి ప్రేమ కథలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘జితేందర్‌ రెడ్డి’. ఈ సినిమాలో ‘జితేందర్‌ రెడ్డి’గా చేసింది ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 21న వచ్చే ఫస్ట్ లుక్ వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు చిత్రయూనిట్. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Klin Kaara: 3 నెల‌ల పాటు అమ్మ‌మ్మగారి ఇంట్లో ఉండి వచ్చిన ‘క్లీంకార’కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం

************************************

*Naga Susheela: కింగ్ నాగార్జున సోదరిపై కేసు నమోదు

************************************

*Chiranjeevi: చిన్ని క్లీంకారతో వినాయక చవితి సెలబ్రేషన్.. పిక్స్ వైరల్

***********************************

*Mahima Nambiar: క్యాస్టింగ్ కౌచ్‌పై ఏమందంటే..

***********************************

Updated Date - 2023-09-18T19:51:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!