కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tiger Nageswara Rao: నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ సోదాలు

ABN, First Publish Date - 2023-10-11T17:02:10+05:30

'కాశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2', 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాల నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Producer Abhishek Agarwal

'టైగర్ నాగేశ్వర రావు' #TigerNageswaraRao చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ (AbhishekAgarwal) కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. IT raids on producer Abhishek Agarwal office. అభిషేక్ అగర్వాల్ ఈమధ్య 'కార్తికేయ 2' #Karthikeya2 అనే సినిమా నిర్మించారు, అది తెలుగులోనూ, అలాగే మిగతా భాషల్లోనూ కూడా పెద్ద విజయం సాధించింది. 'కాశ్మీర్ ఫైల్స్' #TheKashmirFiles అనే సినిమా కూడా ఇతనే నిర్మించారు, ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. మధ్యలో రవితేజ (RaviTeja) కథానాయకుడిగా 'ధమాకా' #Dhamaka అనే సినిమాని టిజి విశ్వప్రసాద్ (TGViswaprasad) తో కలిపి నిర్మించారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించటమే కాకుండా, డబ్బులు కూడా బాగా తెచ్చి పెట్టింది.

ఇప్పుడు రవి తేజ కథానాయకుడిగా 'టైగర్ నాగేశ్వర రావు' అనే సినిమా నిర్మిస్తున్నారు అభిషేక్ అగర్వాల్. ఇది పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతోంది. ప్రస్తుతం రవి తేజ ఈ సినిమా హిందీ ప్రచారాల కోసం ముంబైలో వున్నారు. ఇలా వరస విజయాలతో, సినిమాలని నిర్మిస్తున్న అభిషేక్ అగర్వాల్ లావాదేవీలపై అలాగే పన్ను చెల్లింపులపై కూడా ఆదాయపు శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది.

అతను నిర్మించిన మూడు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో విజయం సాధించటం, ఆ సినిమాల మీద రెవిన్యూ కూడా బాగా రావటంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆ వివరాలు మొత్తం అడిగి తెలుసుకుంటున్నటుగా సమాచారం.

Updated Date - 2023-10-11T17:02:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!