Ambajipeta Marriage Band: ఫస్ట్ లుక్‌తోనే మోత మోగించారు

ABN , First Publish Date - 2023-04-11T20:28:19+05:30 IST

ఫస్ట్ లుక్ ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. ఈ బ్యాండ్ సభ్యులు మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నామనేలా ఈ ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంతకు ముందు

Ambajipeta Marriage Band: ఫస్ట్ లుక్‌తోనే మోత మోగించారు
Ambajipeta Marriage Band First Look

కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరోగా మారి.. ‘కలర్ ఫోటో’ (Colour Photo) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సుహాస్ (Suhas). కేవలం యూత్‌కి నచ్చే కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు మాత్రమే కాకుండా, రీసెంట్‌గా ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) వంటి సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా దగ్గరయ్యాడు. ఇప్పుడు సుహాస్ హీరోగా జీఏ2 పిక్చ‌ర్స్ (GA2 Pictures) బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ (Ambajipeta Marriage Band). స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు (Bunny Vas) మరియు దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. జీఏ2 పిక్చ‌ర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, వెంక‌టేశ్ మ‌హా నిర్మాణంలో దుశ్యంత్ కటికనేని (Dushyanth Katikineni) దర్శకత్వంలో.. ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం మవుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. (Ambajipeta Marriage Band First Look)

ఫస్ట్ లుక్ ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. ఈ బ్యాండ్ సభ్యులు మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నామనేలా ఈ ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఫస్ట్ లుక్‌ విడుదలకు సంబంధించి విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా.. సుహాస్ నుంచి మరో వైవిధ్యభరిత సినిమా రాబోతుందనే టాక్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ కూడా అదే స్పందనను రాబట్టుకుంటోంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌లో పనిచేసే మల్లి (Malli) అనే కుర్రాడిగా సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. (Ambajipeta Marriage Band Movie)

Malli.jpg

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మల్లికార్జున సెలూన్ షాప్‌ను చూపిస్తూ, సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మెంబర్స్‌ను రివీల్ చేశారు. సుహాస్‌తో పాటు గోపరాజు రమణ, పుష్ప ఫేమ్ జగదీశ్.. ఇంకా డప్పులు, సన్నాయితో పాటు పలురకమైన మంగళవాయిద్యాలు.. ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. సెలూన్ షాప్ నడుపుకునే మల్లికి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ కూడా ఉంటుందనేది ఈ పోస్టర్‌తో స్పష్టమవుతుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నామని.. వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ తెలుపుతున్నారు. (Ambajipeta Marriage Band Telugu Movie)

ఇవి కూడా చదవండి:

*********************************

*All India NTR Fans: ‘సింహాద్రి’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం తప్ప.. స్వలాభం కోసం కాదు

*Ram Charan and Upasana: మాల్దీవుల్లో ఉన్నా.. మరిచిపోలేదండోయ్..

*Allu Aravind: సాయిధరమ్ ఫోన్ చేస్తుంటే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా అడుగుతాడనుకున్నా.. కానీ?

*Raghava Lawrence: రామ్ చరణ్‌లో నాకు నచ్చింది ఏమిటంటే..

*Samantha: నేను ఫేస్ చేసిన స‌మ‌స్య‌ల వ‌ల్లే.. ఇప్పుడిలా మారిపోయా!

*NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్

*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది

Updated Date - 2023-04-11T20:28:20+05:30 IST