కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Shankar : రిజెక్ట్‌ చేశారంటూ పోస్ట్‌... దర్శకుడు క్లారిటీ!

ABN, First Publish Date - 2023-12-15T16:28:54+05:30

మాస్‌ మహారాజా రవితేజ(Ravi teja), హరీశ్‌ శంకర్‌ (Harish shankar) కలయికలో ఇటీవల ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే!  'షాక్‌', ‘మిరపకాయ్‌’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిదే. త్వరలో సెట్స్‌ మీదకెళ్లనున్న ఈ చిత్రం గురించి పలు వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

Harish Shankar :  రిజెక్ట్‌ చేశారంటూ పోస్ట్‌... దర్శకుడు క్లారిటీ!


మాస్‌ మహారాజా రవితేజ(Ravi teja), హరీశ్‌ శంకర్‌ (Harish shankar) కలయికలో ఇటీవల ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే!  'షాక్‌', ‘మిరపకాయ్‌’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిదే. త్వరలో సెట్స్‌ మీదకెళ్లనున్న ఈ చిత్రం గురించి పలు వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నఓ వార్తపై హరీశ్‌ శంకర్‌ స్పందించారు. రవితేజ-హరీశ్‌ శంకర్‌ చిత్రాన్ని ఇద్దరు హీరోయిన్స్‌ రిజెక్ట్‌ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం నటి మీనాక్షి చౌదరిని (Meenakshi chowdary) సంప్రదించగా.. డేట్స్‌ విషయంలో సమస్యలు తలెత్తడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంది. పారితోషికం కారణంగా ఇలియానా నో చెప్పింది. ఇప్పుడు చిత్ర బృందం ‘యానిమల్‌’ ఫేమ్‌ త్రిప్తి డిమ్రి పేరును పరిశీలిస్తున్నారు' అంటూ ట్విట్టర్‌లో వచ్చిన ఓ పోస్ట్‌కు దర్శకుడు హరీశ శంకర్‌ స్పందించారు.

"ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. శ్రుతి హాసన్‌, పూజాహెగ్డే.. ఇలా నా ట్రాక్‌ రికార్డ్‌ తెలిసిన వారందరికీ నా సెలెక్షన్ పై అపారమైన నమ్మకం ఉంది. ‘యానిమల్‌’ రిలీజ్‌కు ముందే మా సినిమా క్యాస్టింగ్‌ పూర్తైంది. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను
స్ప్రెడ్  చేయకండి. ఏదైనా సందేహం ఉంటే నన్ను సంప్రదించండి. మెసేజ్‌లకు నేను అందుబాటులోనే ఉంటా’’ అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా నిర్మాణం జరగనుంది.

Updated Date - 2023-12-15T16:28:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!