SharwanandMarriage: శర్వానంద్ వివాహం జూన్ 2 న జైపూర్ లో

ABN , First Publish Date - 2023-05-17T10:41:24+05:30 IST

మొత్తానికి నటుడు శర్వానంద్ అధికారికంగా తన వివాహం గురించి ఒక ప్రకటన విడుదల చేసాడు. అందులో తన వివాహం, ఎప్పుడు, ఎక్కడ ఇవన్నీ ప్రకటించాడు. ఇంతకీ ఎక్కడంటే...

SharwanandMarriage: శర్వానంద్ వివాహం జూన్ 2 న జైపూర్ లో
Sharwanand and Rakshita

కొన్ని రోజుల నుండి నటుడు శర్వానంద్ (Sharwanand) వివాహం గురించి సాంఘీక మాధ్యమంలో ఇటు కొన్ని మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అయ్యాయి. కొందరు శర్వానంద్, రక్షిత (Rakshita) ల ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయిందని, శర్వా వివాహం వాయిదా వేసుకున్నాడని, ఇలా పలు రకాలుగా వార్తలు రాసారు, వైరల్ కూడా అయ్యాయి. #SharwanandMarriage అయితే మే నెల చివరి వరం లో జైపూర్ (Jaipur) లో జరగాల్సిన వివాహం ఎందుకో వాయిదా పడింది అని నిన్న 'ఆంధ్రజ్యోతి' లో వార్త రాసాము. జూన్ లో జరగవచ్చు అని కూడా ఆ వార్తలో రాసాము.

sharwanand (41).JPG

ఈరోజు శర్వానంద్ తమ మేనేజర్ ద్వారా అధికారికంగా తన వివాహం గురించి ప్రకటించాడు. జూన్ 2, 3వ తేదీల్లో రాజస్థాన్ స్టేట్ జైపూర్ లో జరుగుతుందని అందులో #SharwanandMarriage ప్రకటించాడు. దీనితో శర్వానంద్ వివాహం గురించి వచ్చిన రూమర్స్, వార్తలకు ఒక స్టాప్ పెట్టినట్టు అయింది. మూడు నెలలు క్రితం శర్వానంద్, రక్షిత ల ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది, కానీ ఆ తరువాత వివాహం ఎప్పుడు అనే విషయం మీద అటు శర్వానంద్ కుటుంబం కానీ, ఇటు రక్షిత కుటుంబం కానీ ఎటువంటి ప్రకటన చెయ్యలేదు.

అయితే ఇన్ని నెలలు గ్యాప్ తీసుకోవటంతో సాంఘీక మాధ్యమంలో వివాహం మీద అనేక వార్తలు బయలుదేరాయి. ముందుగానే తన వివాహం గురించి సమాచారం ఇచ్చి ఉంటే ఇంత వివాదం జరిగి ఉండేది కాదు, #SharwanandMarriage అని పరిశ్రమలో అంటున్నారు. లేట్ అయినా కూడా తన వివాహం గురించి ఒక అధికారిక ప్రకటన ఇచ్చి ఇప్పటికైనా ఒక మంచి పని చేసాడు శర్వానంద్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ కాబోయే జంటకి అల్ ది బెస్ట్!

ఇది కూడా చదవండి:

Sharwanand: మే ఎండింగ్‌లో.. జైపూర్‌లో పెళ్లి అనుకున్నారు కానీ..?

Updated Date - 2023-05-17T10:47:33+05:30 IST