Ravanasura: ఈ కుర్ర నటి విలన్ పాత్రలు వేస్తాను అంటోంది

ABN , First Publish Date - 2023-03-21T15:08:02+05:30 IST

'జాతి రత్నాలు' తో మొదటి సినిమాతోనే పెద్ద విజయం సాధించింది ఈ హైదరాబాదీ అమ్మాయి. తరువాత నాలుగయిదు సినిమాలు చేసిన, ఇప్పుడు రవి తేజ లాంటి పెద్ద నటుడు పక్కన 'రావణాసుర' లో చేస్తోంది. ఇంతకీ ఆమెకి ఎలాంటి పాత్రలంటే ఇష్టమో తెలుసా...

Ravanasura: ఈ కుర్ర నటి విలన్ పాత్రలు వేస్తాను అంటోంది

2021 లో విడుదల అయిన 'జాతి రత్నాలు' (Jaathi Ratnalu) సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అందులో నటించిన నవీన్ పోలిశెట్టి (Naveen Polisetty) కి ఎంత పేరు వచ్చిందో, అలాగే కథానాయిక ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) కి కూడా అంతే పేరు వచ్చింది. అందులోని 'చిట్టీ నీ నవ్వంటే లక్ష్మీ పటాసే' పాట ఎంత క్రేజ్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసిన ఫరియా, ఇప్పుడు రవితేజ (Ravi Teja) 'రావణాసుర’ (Ravanasura) లో అయిదుగురు కథానాయికల్లో ఒకరుగా చేస్తోంది. ఫరియా ఈ సినిమాలో ఒక లాయరు పాత్రలో కనబడబోతోంది. అయిదుగురు కథానాయికలు ఉన్నప్పటికీ వాళ్లందరితో ఈమెకి సన్నివేశాలు లేవు అంటోంది. ఒక్క మేఘ ఆకాష్ (Megha Akash) తోటే ఈమెకి కాంబినేషన్ సీన్స్ వున్నాయి అని చెపుతోంది ఫరియా. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పాత్రలో కనపడతారు అని చెపుతోంది. అయినా కథలో మాత్రం ఈమెదే కీలకమైన పాత్ర అంటూ వుంది. నటించడానికి ఆస్కారం వుండే పాత్ర ఆమెది అని చెప్తోంది ఫరియా.

fariaabdullah2.jpg

లాయరు పాత్ర సినిమాలో వేసిన కోర్టులో సీన్స్ ఏమీ ఎక్కువ వుండవు అంటోంది. అయితే లాయర్ నేపధ్యం మాత్ర కీలకంగా అంటోంది. ఇందులో ఆమె ఒక పెళ్లయిన అమ్మాయిగా కనపడుతుంది, అందుకని బాడీ లాంగ్వేజ్ లో కొంచెం పరిణితి చూపించాలి కదా. అలాగే మైండ్ సెట్ కూడా కొంచెం భిన్నంగా వుండాలి. అందుకని ఫరియా కి ఈ పాత్ర మాత్రం వైవిధ్యంగానే ఉంటుంది.

fariaabdullah.jpg

ఎలాంటి పాత్రలు అంటే ఇష్టం అని అడిగితే, ఫరియా అబ్దుల్లా కి ప్రయోగాలు చెయ్యటం అంటే ఇష్టం అని చెప్తోంది. నెగిటివ్, యాక్షన్, పిరియాడిక్ ఇలా భిన్నమైన పాత్రలు చేయడం ఇష్టం అని చెప్తోంది. అలాగే ఎందుకు ఆమె ఒక్కో సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటోంది అంటే, ఆమెకేమీ తొందర లేదట. "తక్కువ కాలం లో ఎక్కువ సినిమాలు చేసే ఉద్దేశం లేదు. నేను ఏమి చేస్తున్నానో అలాగే నా ప్రయాణంపై నాకు చాలా స్పష్టత వుంది. మరో ఐదేళ్ళలో ఎక్కడ ఉంటానో ఒక అంచనా వుంది. అందుకే సినిమాల ఎంపిక విషయంలో తొందర పడకుండా నిదానంగా వెళుతున్నాను. ఈ సినిమా నేను చేస్తే బాగుణ్ణు అనే రిగ్రేట్స్ లాంటివి లేవు నాకు. అవకాశాలు వస్తాయా రావా అనే భయం కూడా లేదు," అని చెప్పింది ఫరియా.

fariaabdullah1.jpg

ముందు ముందు దర్శకత్వం కూడా చేయాలనుకుంటున్నా అంటోంది. అలాగే ప్రొడక్షన్ లోకి కూడా ఎంటర్ అవుతుందిట. 'రావణాసుర' ఏప్రిల్ 7 వ తేదీన విడుదల అవుతోంది, దీనికి సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకుడు.

Updated Date - 2023-03-21T15:08:03+05:30 IST