Spy: నిఖిల్ కి, నిర్మాతకి మధ్య లుకలుకలు బయటపడ్డాయి

ABN , First Publish Date - 2023-06-12T13:40:47+05:30 IST

నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా సినిమా 'స్పై' చిక్కులో పడిందని ఒక టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా నుంచి ఒక పాటను నిన్న ఆదివారం విడుదల చేస్తే, ఆ పాటని నిఖిల్ తన సాంఘీక మాధ్యమంలో షేర్ చెయ్యలేదు. దీన్ని బట్టి నిర్మాతకి అతనికి మధ్య విడుదల విషయంలో ఏవో తేడాలొచ్చాయి అని అర్థం అవుతోంది.

Spy: నిఖిల్ కి, నిర్మాతకి మధ్య లుకలుకలు బయటపడ్డాయి
Nikhil Siddharth

యువ నటుడు నిఖిల్ సిద్దార్థ్ (NikhilSiddharth) 'కార్తికేయ 2' #Karthikeya2 విజయంతో మంచి ఉత్సాహంగా వున్నాడు. ఆ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా, మిగతా భాషల్లో కూడా, ముఖ్యంగా హిందీలో చాలా బాగా అది కనకవర్షం కురిపించింది. ఆ సినిమా విజయంతో ఇప్పుడు నిఖిల్ 'స్పై' #Spy అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ప్రచారం కూడా చాలా అట్టహాసంగా ఢిల్లీ లో మొదలెట్టారు. ఇది ఒక్క తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. అందుకని ఈ సినిమా ప్రచారాలు కూడా అలాగే ఉండాలని నిఖిల్ అభిప్రాయపడి దానికి సిద్ధం అయ్యాడు కూడా. ఈ సినిమా ఈనెల 29న SpyOnJune29 విడుదల అవుతోంది.

nikhilspy.jpg

ఈ సినిమాకి కె రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) నిర్మాత అయితే, గ్యారీ పిహెచ్ (Gary PH) దీనికి దర్శకుడు. ఈ సినిమా నేపధ్యం స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (SubhashChandrabose) చనిపోయారా, బతికున్నారా, ఉంటే ఎక్కడున్నారు, ఎలా మాయం అయ్యారు అనే ఒక మిస్టరీ కథ ఆధారంగా వస్తున్న సినిమా ఇది. నిన్న ఆదివారం ఈ సినిమా నుంచి ఒక పాట ప్రచార చిత్రాల్లో భాగంగా విడుదలైంది. 'జూమ్ జూమ్' అనే ఈ పాట లీడ్ పెయిర్ నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్ (AishwaryaMenon) మధ్య వచ్చే లవ్ రొమాంటిక్ సాంగ్ గా చిత్రీకరించారు. విశాల్ చంద్రశేఖర్ (VishalChandrasekhar) ఈ సినిమాకు సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు. అలాగే శ్రీ చరణ్ పాకాల (SricharanPakala) 'స్పై' #Spy సినిమాకు నేపధ్య సంగీతం అందిస్తున్నారు.

ఇంతవరకు ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడే అసలు కథ మొదలయింది. ఎందుకంటే ఈ సినిమా పాట నిఖిల్ కి తెలియకుండా విడుదల చేసారని ఒక వార్త పరిశ్రమలో నడుస్తోంది. ఎందుకంటే ఈ పాటను, నిఖిల్ తన సాంఘీక మాధ్యమాల్లో షేర్ చెయ్యలేదు. ఈ సినిమా గురించి నిఖిల్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని ఇంతకు ముందు జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు. అలాంటిది మరి ఈ పాటను అతను ఎందుకు షేర్ చెయ్యలేదో మరి. దీనిని బట్టి నిఖిల్ కి, నిర్మాత కి పడటం లేదని, ఇద్దరి మధ్య చిన్న వార్ నడుస్తోందని తెలుస్తోంది.

Nikhil-Movie.jpg

మామూలుగా సినిమా కథానాయకుడు తన సాంఘీక మాధ్యమంలో తన సినిమా గురించి మాట్లాడుతాడు, అలాంటిది నిఖిల్ తన సినిమా పాట షేర్ చేయకపోవటం ఒక చర్చ గా మారింది. విడుదల తేదీ విషయంలో నిఖిల్ కి, నిర్మాతకి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని తెలిసింది. జూన్ 29 కాకుండా ఇంకో వారం పాటు వాయిదా వేస్తె, ప్రచారాలకి సమయం దొరుకుతుందని నిఖిల్ వాదన అనీ, కానీ నిర్మాత ఒప్పుకోలేదని తెలిసింది. దానితో ఇద్దరి మధ్య కొంచెం తేడాలొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి గొడవల మధ్య ఈ 'స్పై' సినిమా ఎలా విడుదల అవుతుందో, ఎటువైపు వెళుతుందో చూడాలి.

Updated Date - 2023-06-12T13:40:47+05:30 IST