Khushi: ట్రైలర్ లోని ఈ డైలాగ్ అనసూయని ఉద్దేశించి అన్నదేనా...

ABN , First Publish Date - 2023-08-09T18:28:25+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషీ' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చివర్లో విజయ్ చెప్పిన డైలాగ్ ఒకటుంది. అది ప్రముఖ యాంకర్, నటి, అలాగే విజయ్ దేవరకొండ మీద ఈమధ్య విమర్శలు చేస్తున్న అనసూయ ని ఉద్దేశించి చెప్పిన డైలాగా అని ఒక చిన్న సందేహం వుంది

Khushi: ట్రైలర్ లోని ఈ డైలాగ్ అనసూయని ఉద్దేశించి అన్నదేనా...
Vijay Deverakonda

విజయ్ దేవరకొండ (VijayDeverakonda), సమంత (Samantha) జంటగా నటించిన 'ఖుషీ' #Khushi సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. దీనికి శివ నిర్వాణ (ShivaNirvana) దర్శకుడు, మైత్రీ మూవీ మేకర్స్ (MythriMovieMakers) నిర్మాణం చేశారు. ఈ సినిమా ఎప్పుడో మొదలయింది, కానీ మధ్యలో సమంత కి వచ్చిన వింతవ్యాధి వలన, ఆమె ఈ సినిమా షూటింగ్ కి కొన్నాళ్ల పాటు దూరం కావాల్సి వచ్చింది. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, ఇప్పుడు సెప్టెంబర్ 1 న విడుదలవటానికి సిద్ధంగా వుంది.

ఈ సినిమా ప్రచారాలు కూడా ముందుగా ఒక పాట విడుదలతో మొదలెట్టేసారు. ఆ తరువాత ఇంకో రెండు పాటలు విడుదలయ్యాయి, అయితే విడుదలైన పాటలు అన్నీ చాలా బాగున్నాయి, వినసొంపుగా వున్నాయి. సంగీత దర్శకుడు అబ్దుల్ వాహాబ్ (HeshamAbdulWahab) మలయాళం నుండి వచ్చాడు, అతనికి ఈ 'ఖుషీ' సినిమా మొదటి తెలుగు సినిమా కావటం ఆసక్తికరం.

ఇంతకీ ఈ ట్రైలర్ ఎలా ఉందొ దాని గురించి కదా మనం మాట్లాడాల్సింది. ట్రైలర్ చూస్తున్నప్పుడు ఈ సినిమాలో ముందుగా విజయ్, సమంత ల మధ్య ఆ కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది అనిపిస్తోంది. అలాగే మధ్యలో వచ్చే ఆ ఫన్ ఎలెమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే విజయ్ 'బేగం' అంటూ తిరిగే సన్నివేశాలు అతను ఇంతకు ముందు చేసిన 'గీత గోవిందం' #GeethaGovindam సినిమాని తలపించేలా వున్నాయి. అలాగే ట్రైలర్ మధ్యలో నేను బేగం ని కాదు, బ్రాహ్మిన్ అని సమంత చెప్పగానే ఈ సినిమాలో 'అంటే సుందరానికి' #AnteSundaraniki, 'కృష్ణ వీరింద విహారి' (KrishnaVrindaVihari) సినిమాలాలా ఉంటుందేమో అని కూడా అనిపించింది.

అయితే ఒక్కటి మాత్రం నిజం, ట్రైలర్ చూసి ఇందులో ఎన్ని సినిమాల మిక్స్ ఉందీ, ఆ సినిమాకి కాపీనా, లేదా వేరే సినిమాకి కాపీనా, ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా దర్శకుడు శివనిర్వాణ ఎలా చూపించబోతున్నాడు అనే విషయం మీదే ఆధారపడి వుంది. ఎందుకంటే శివ నిర్వాణ బలం అంతా అతని రచనలో వుంది. ఇంతకు ముందు అతని చేసిన 'నిన్ను కోరి' #NinnuKori, 'మజిలీ' #Majili సినిమాలు చూస్తే అతను ఎంత బలమైన మాటలు రాయగలడు, అలాగే ఆ భావోద్వేగాలను ఎంత హృద్యంగా తెర మీద ప్రేక్షకుడి హృదయానికి తగిలేట్టు చెయ్యగలడు అనేది అర్థం అవుతుంది. అందుకని ఈ సినిమా కూడా అతను అంత హృద్యంగా చూపించగలడు అని గట్టి నమ్మకం వుంది.

vijaydeverakonda2.jpg

ఇక రాహుల్ రామకృష్ణ (RahulRamakrishna), వెన్నెల కిషోర్ (VennelaKishore) ఇద్దరూ సినిమాలో కొంచెం ఫన్ డైలాగ్స్ చెప్పిన్నట్టుగా కనపడుతోంది. ట్రైలర్ మొదలవ్వటం కూడా 'దీనెమ్మ కాశ్మీర్, రోజా #Roja సినిమాలా వుంది' అని మొదలయ్యింది. విజయ్ దేవరకొండ ఈ సినిమాకి బాగా స్లిమ్ గా, స్మార్ట్ గా చాలా బాగున్నాడు, బాగా కనపడుతున్నాడు. అలాగే అతని మళ్ళీ ఈ సినిమాతో ఊపందుకుంటాడు అనిపిస్తోంది. ఇక సమంత కూడా చాలా అందంగా వుంది, ఆమె ముందు సినెమాలకన్నా ఇందులో కొంచెం వైవిధ్యంగా కనపడుతోంది. ఛాయాగ్రహణం బాగుంది.

ఇక ఈ ట్రైలర్ లో చివర్లో "ఎందుకు బయపడుతున్నావమ్మా నువ్వు, మార్కెట్లో నా గురించి అట్లా అనుకుంటున్నారు గానీ, నేను స్త్రీ పక్షపాతిని..." ఈ డైలాగ్ మాత్రం అదిరింది. అయితే ఇది ఎవరికోసమో అన్నట్టుగా వుంది కదూ! అదే విజయ్ దేవరకొండ ఏమి చేసినా బాగా విమర్శలు చేస్తున్న అనసూయ (Anasuya) కోసం అయితే ఈ డైలాగ్ పెట్టలేదు కదా అన్న సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే అమే ఈమధ్య సాంఘీక మాధ్యమాల్లో విజయ్ ని ఎదో ఒకటి అంటూ వస్తూ వుంది. మొత్తం మీద ఈసారి విజయ్, సమంత ఇద్దరూ హిట్ కొట్టేట్టు కనిపిస్తున్నారుగా !

Updated Date - 2023-08-09T18:28:25+05:30 IST