SIR Twitter Review: ధనుష్ తెలుగు డెబ్యూ మూవీ హిట్టా? ఫట్టా?

ABN , First Publish Date - 2023-02-17T09:22:45+05:30 IST

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుల్లో ధనుష్ (Dhanush) ఒకరు. ఇప్పటి వరకూ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

SIR Twitter Review: ధనుష్ తెలుగు డెబ్యూ మూవీ హిట్టా? ఫట్టా?
SIR

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుల్లో ధనుష్ (Dhanush) ఒకరు. ఇప్పటి వరకూ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘సార్’ (SIR) అనే డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. తమిళంలో ‘వాతి’ పేరుతో విడుదల కానుంది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి (Samyuktha Menon) ఈ మూవీకి దర్శకుడు. సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించిన.. ఈ చిత్రంలో సాయి కుమార్, సముద్రఖని, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పొషించారు. ఈ సినిమాపై తమిళ, తెలుగు భాషల్లో మంచి బజ్ ఉంది. ఈ మూవీ నేడు (ఫిబ్రవరి 17) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. (SIR Twitter Review)

అయితే ఇప్పటికే పలు చోట్ల ఈ చిత్ర ప్రీమియర్ షోలు పడిపోయాయి. విద్యా వ్యాపారంగా ఎలా మారింది.. చదువుని అడ్డు పెట్టుకుని ప్రజల బలహీనతతో ఆడుకుంటూ కొందరు ఎలా కోట్లు సంపాదిస్తున్నారనే పలు అంశాలని దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీ చూపించాడు. దీంతో ప్రీమియర్స్ చూస్తున్న అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ రెస్పాన్స్ తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Vijay Devarakonda: ‘అదొక్కటే పెండింగ్ రా.. కొడదాం’.. ఉత్సాహంగా చెప్పిన రౌడీ హీరో

‘ఇప్పుడే సర్ మూవీ ప్రీమియర్ అయిపోయింది. మంచి సినిమా. ధనుష్ మళ్లీ హిట్ కొట్టేశాడు’.. ‘చివరికి ఓ తెలుగు దర్శకుడు, తమిళ నటుడితో ఓ హిట్ కొట్టాడు. మొదటి ద్విభాష బ్లాక్ బస్టర్ మూవీ సర్. అపవాదు చేరిగిపోయింది’.. ‘వెంకి అట్లూరికి మంచి కమ్‌బ్యాక్. ధనుష్ కెరీర్‌లో ఓ మంచి చిత్రమౌతుంది’ అని రాసుకొస్తున్నారు. కాగా, ట్విట్టర్ వేదికగా ఈ మూవీ గురించి మరికొంతమంది సినీ లవర్స్ ఏం చెబుతున్నారో చూద్దాం..

Updated Date - 2023-02-17T09:37:55+05:30 IST