Vijay Devarakonda: ‘అదొక్కటే పెండింగ్ రా.. కొడదాం’.. ఉత్సాహంగా చెప్పిన రౌడీ హీరో

ABN , First Publish Date - 2023-02-16T12:31:03+05:30 IST

ఎవరీ సపోర్టు లేకుండా సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ సాధించిన నటుడు విజయ దేవరకొండ (Vijay Devarakonda). ‘పెళ్లి చూపులు’ హీరోగా ఎంట్రీ ఈ ఇచ్చిన ఈ నటుడు మొదటి సినిమాతో విజయాన్ని అందుకున్నాడు.

Vijay Devarakonda: ‘అదొక్కటే పెండింగ్ రా.. కొడదాం’.. ఉత్సాహంగా చెప్పిన రౌడీ హీరో
Vijay Devarakonda

ఎవరీ సపోర్టు లేకుండా సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ సాధించిన నటుడు విజయ దేవరకొండ (Vijay Devarakonda). ‘పెళ్లి చూపులు’ హీరోగా ఎంట్రీ ఈ ఇచ్చిన ఈ నటుడు మొదటి సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. అనంతరం వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy), ‘గీత గోవిందం’ (Geetha Govindam) సినిమాలతో యూత్‌లో విజయ్‌కి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ యువ నటుడు అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాడనే విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకి సంబంధించిన అన్ని విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో విజయ్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా అభిమానుల అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలి సమాధానాలు ఇచ్చాడు.

ఈ సందర్భంగా ఓ అభిమాని మాట్లాడుతూ.. ‘మర్చిపోలేని ఒక్క హిట్‌ ఇవ్వన్నా’’ అని ఓ అభిమాని విజయ్‌ని అడిగాడు. దానికి స్పందించిన విజయ్‌ ‘అదొక్కటే పెండింగ్ రా.. కొడదాం కొడదాం’ అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోని విజయ్‌ ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు. ‘ఖుషి’ సినిమాతో విజయ్ కచ్చితంగా సూపర్‌ హిట్‌ ఇస్తాడని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Anushka Shetty: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్వీటీ.. మొదలుపెడితే 20 నిమిషాలపాటు నాన్‌స్టాప్‌గా..

గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ చేసిన ‘లైగర్’ డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం దక్కుతుందని ఈ రౌడీ హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ ఆశలు అడియాశలు అయ్యాయి. కాగా.. విజయ్‌ ప్రస్తుతం సమంతతో కలిసి ‘ఖుషి’ (Kushi) అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు పూర్తయింది. ఇక ఆయన ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. అలాగే పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా, గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాకి విజయ్‌ ఓకే చెప్పాడు. అలాగే యువ నటుడు నానితో ఓ మల్టీ స్టారర్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Updated Date - 2023-02-16T12:31:05+05:30 IST