సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dhanush 51: శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో..

ABN, First Publish Date - 2023-07-28T11:36:06+05:30

ధనుష్‌ 51వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ నారాయణ్‌ దాస్‌ కె నారంగ్‌ నిర్మాణంలో రాబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. గురువారం ఆయన జయంతి సందర్బ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

ధనుష్‌ 51వ (Dhanush 51)చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. శేఖర్‌ కమ్ముల (sekhar kammula) దర్శకత్వంలో అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ నారాయణ్‌ దాస్‌ కె నారంగ్‌ నిర్మాణంలో రాబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. గురువారం ఆయన జయంతి సందర్బ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ధనుష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె నారంగ్‌ ఆశీర్వాదంతో నిర్మాతలు సునీల్‌ నారంగ్‌(Sunil narang), పుస్కుర్‌ రామ్మోహన్‌ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. ధనుష్‌ పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో ఓ వైపు ఖరీదైనా భారీ భవంతులు, మరోవైపు పేదరికాన్ని చూపించే మురికివాడ.. ఈ రెండింటికీ మఽధ్య పాత వంద రూపాయల నోట్ల కట్ట కనిపించింది. సొసైటీలో అసమానతల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్‌లో ధనుష్‌ను చూపించే పర్ఫెక్ట్‌ కథను శేఖర్‌ కమ్ముల సిద్ధం చేశారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Updated Date - 2023-07-28T11:36:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!