Alekhya harika: హీరోయిన్ గా దేతడి హరిక.. నిలదొక్కుకునేనా

ABN , First Publish Date - 2023-10-29T20:23:24+05:30 IST

దేతడి హరిక.. ఈ పేరు తెలియని యూట్యూబ్ వీక్షకులు ఉండరు. ఇప్పుడు ఓ సినిమా ఛాన్స్ దక్కించుకుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల కల్ట్ బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన బేబీ సినిమా దర్శక, నిర్మాతలు సంయుక్తంగా లో బడ్జెట్ లో నిర్మించబోయే సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది.

Alekhya harika: హీరోయిన్ గా దేతడి హరిక.. నిలదొక్కుకునేనా
Harika

దేతడి హరిక(Alekhya harika) ఈ పేరు తెలియని యూట్యూబ్ వీక్షకులు ఉండరు. అంతలా అమె ఫేమస్ . 2015, 2016ల నుంచే యూ ట్యూబ్ వీడియోలలో నటిస్తూ మంచి పేరు సంపాదించింది. పక్కా తెలంగాణ యాసలో మాట్లాడుతూ మన పక్కింటి అమ్మాయి అనిపించేలా ఉండడం ఈ అమ్మడి ప్రత్యేకత. యూట్యూబ్ వీడియోలతో వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ కి సెలక్టై టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకటిగా చివరికంటా నిలిచింది. అందులో అభిజిత్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ జనాల కళ్లలో పడింది.

dethadi.jpg

అక్కడి నుంచి వచ్చిన అనంతరం సినీ అవకాశాలు అశించినంతగా తలుపుతట్టకపోవడంతో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఛాన్స్ ల కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలో ’ఏమండోయ్ ఓనర్ గారు’, ’గానం‘ వంటి వెబ్ సీరిస్ లలో నటించి, మధ్యలో రెండు మూడు సినిమాలు చేసింది. వచ్చిన ఆ అవకాశాలు ఆమె కేరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడక పోవడంతో హీరోయిన్ కావాలనే తన కల అలాగే ఉండిపోయింది. (Dhethadi)

harika.jpg

అయితే ఆరు నెలల క్రితం తను నటించిన వెళ్లకే (Vellake) అనే వీడియో సాంగ్ వీపరీతమైన సక్సెస్ అయి మిలియన్లలో వ్యూస్ రావడంతో ఈ అమ్మడు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఓ సినిమా ఛాన్స్ దక్కించుకుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


మూడు నెలల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ’బేబీ‘ సినిమా దర్శక, నిర్మాతలు సంయుక్తంగా లో బడ్జెట్ లో నిర్మించబోయే సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది. ’పేపర్ బాయ్, కల్యాణం కమణీయం, ఏక్ మినీ కథ‘ సినిమాల ద్వారా గుర్తింపు పొందిన సంతోష్ శోభన్ హీరోగా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ త్వరలోనే అధికారికంగా ఓ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Updated Date - 2023-10-29T20:35:34+05:30 IST