సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Das Ka Dhamki: రామ్ మిరియాల ‘మావా బ్రో’ వచ్చేసింది

ABN, First Publish Date - 2023-01-20T20:33:52+05:30

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి

Vishwak Sen In Das Ka Dhamki
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశ్వక్ హీరోనే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా. అతనికి జోడీగా నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ (Almost Padipoyindhe Pilla).. ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత విడుదల చేసిన ఇదే పాట వీడియో సాంగ్‌ కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ‘మావా బ్రో’ (Mawa Bro) లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఇది రామ్ మిరియాల (Ram Miriyala) స్పెషల్. స్టార్ సింగర్ లైవ్లీ బీట్‌లతో పెప్పీ నంబర్‌ను స్కోర్ చేశాడు. అతని వాయిస్ కూడా లవ్లీ గా ఉంది.

సందమామ రావే అంటే వచ్చిందా.. రాలే రాలే

బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా.. తేలే తేలే

మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా.. చాల్లే చాల్లే

ఇన్‌స్టాలో కష్టాలు చూపించుకుంటారా.. నిజమే నిజమే..

పైకి నువ్వు చూసేది ఒకటి.. లోపల ఇంకోటి.. గోవిందా

జిందగిని ఆడో ఈడో.. ఇంకొకడెవడో ఆడిస్తాడు బ్రో..

అందులో నీతోనే ఒక ఐటంసాంగ్‌ని పాడిస్తాడు బ్రో..

జిందగీ అంతే అంతే.. అంతే అంతే.. మావా బ్రో..

లైఫ్ అంతా ఇంతే ఇంతే.. ఇంతే ఇంతే మావా బ్రో.. అంటూ ఈ పాట సాగింది.

నిజానికి, పాట నార్మల్‌గా ఉన్నా.. రామ్ మిరియాల వాయిస్ మరో స్థాయికి తీసుకువెళుతుంది. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak)లో ఆయన పాడిన పాట ఎంత ఫేమస్ అయిందో తెలియంది కాదు. ఇప్పుడు విడుదలైన ‘మావా బ్రో’ (Mawa Bro) ట్యూన్ కూడా చాలా క్యాచీగా ఉంది. కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) అందించిన సాహిత్యం సామాన్యునికి సైతం కనెక్ట్ అయ్యేలా ఉంది. విశ్వక్ సేన్ ఈ పాటలో లైవ్లీగా కనిపించాడు. అతని డ్యాన్స్ చూడటానికి ట్రీట్‌గా వుంది. ఇది ఆల్బమ్ నుండి మరొక బ్లాక్ బస్టర్ నంబర్ అవుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాగా.. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 17 ఫిబ్రవరి, 2023న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-01-20T20:33:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!