Chiranjeevi: పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా.. అలా చేయండి తలవంచి నమస్కరిస్తారు!

ABN , First Publish Date - 2023-08-08T10:51:49+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా పరిశ్రమపై పడతారేంటి? అని ప్రశ్నించారు. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం 200 రోజులు పూర్తి చేసుకొంది. కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం విజయోత్సవ వేడుకను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

Chiranjeevi: పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా.. అలా చేయండి తలవంచి నమస్కరిస్తారు!

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా పరిశ్రమపై పడతారేంటి? (Chiru Satires on Politicians) అని ప్రశ్నించారు. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రం 200 రోజులు పూర్తి చేసుకొంది. కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) (Bobby) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం విజయోత్సవ వేడుకను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘మీలాంటి (రాజకీయ నాయకులను ఉద్దేశించి) వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేేస్త అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..’’ అని చురకలు వేశారు.

WhatsApp Image 2023-08-07 at 10.48.06 PM.jpeg

‘‘ఒకప్పుడు.. సినిమాలు 100, 125, 175, 200 రోజులు ఆడేవి. ఇప్పుడు.. రెండు వారాలే ఆడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు ప్రదర్శిచడం ఆనందంగా ఉంది. అత్యధిక రోజులు ప్రదర్శితమై విజయానికి గుర్తుగా షీల్డులు అందుకుంటున్నందుకు ఒళ్లు పలకరిస్తోంది. చరిత్రను తిరగరాసినట్టు అనిపిస్తోంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రవితేజ, హరీశ్‌ శంకర్‌, చిత్ర నిర్మాతలతోపాటు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (200 Days of Waltair Veerayya)

చిరంజీవి, శ్రుతీహాసన్‌ జంటగా బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే! మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated Date - 2023-08-08T10:54:49+05:30 IST