Chiranjeevi : మనది అలాంటి పరిస్థితి కాదు.. చిరు మాటలు వైరల్‌!

ABN , First Publish Date - 2023-10-13T14:38:22+05:30 IST

తాజాగా జరిగిన ఓ పుస్కకావిష్కరణలో మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల కోసం కష్టపడి పని చేస్తేనే సంతృప్తిగా ఉంటుందని అన్నారు. ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేయాలని చెప్పారు.

Chiranjeevi : మనది అలాంటి పరిస్థితి కాదు.. చిరు మాటలు వైరల్‌!

తాజాగా జరిగిన ఓ పుస్కకావిష్కరణలో మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల కోసం కష్టపడి పని చేస్తేనే సంతృప్తిగా ఉంటుందని అన్నారు. ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన హీరోయిజం, ఎలివేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

‘‘ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంత సాధించినా ఇంకా కష్టపడటం అవసరమా? ఎన్ని రోజులు ఇలా కష్టపడి డ్యాన్స్‌లు ఫైట్‌లు చేయాలని అనుకుంటూ ఉంటాను. నడుచుకుంటూ వెళ్లి, రీరికార్డింగ్‌తో హీరోయిజాన్ని లేపే రోజులివి. హాయిగా సెట్‌కు వెళ్లి మేకప్‌ వేసుకుని, నటించి.. వాళ్లు ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుని వచ్చేేస్త బాగుంటుంది. కానీ, అలాంటి పరిస్థితి మనది కాదు. మనం ఆడాలి, నిజంగానే ఫైట్లు చేయాలి. ఒళ్లు హూనం చేసుకోవాలి. అలా చేయకపోతే దర్శక-నిర్మాతలకు, సినిమా చూేస ప్రేక్షకు?కు తృప్తి ఉండదు. ఫైనల్‌గా నాకూ తృప్తి ఉండదు. అందుకే నిరంతరం కష్టపడాలి అంటాను’’ అని చిరంజీవి అన్నారు. అయితే దీనిని కొందరు పాజిటివ్‌గా తీసుకుంటే మరికొందరు నెగటివ్‌ వేలో తీసుకున్నారు. రీరికార్డింగ్‌తో హీరోయిజం ఎలివేట్‌ అవుతుందా? దాంతోనే సినిమాలు ఆడుతున్నాయా? అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు చిత్రాలున్నాయి. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో మెగా157 చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. నవంబర్‌లో సెట్స్‌ మీదకెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ "సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం రాబోతోంది. త్వరలోనే అందరినీ సినిమాటిక్‌ అడ్వెంచర్‌లోకి తీసుకువెళ్లేందుకు సిద్థంగా ఉన్నాం’’ అని అన్నారు. ఈ చిత్రంలో కథానాయికగా అనుష్క పేరు పరిశీలనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత చిరు తనయ సుష్మిత నిర్మాణంలో గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’పై ఓ సినిమా ప్లాన్  చేస్తున్నారు. ఈ చిత్రానికి కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తాడని సమాచారం.

Updated Date - 2023-10-13T15:47:08+05:30 IST