Chiranjeevi 156: మెగా రాకింగ్‌ ఎంటర్‌టైనర్‌...

ABN , First Publish Date - 2023-08-22T12:22:55+05:30 IST

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రాల అప్‌డేట్స్‌ వరుస కట్టాయి. ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల సొంత బ్యానర్‌పై చిరంజీవి నటించనున్న చిత్రంపై క్లారిటీ వచ్చేసింది. ఈ మేరకు గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ట్వీట్‌ చేసింది.

Chiranjeevi 156: మెగా రాకింగ్‌ ఎంటర్‌టైనర్‌...

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రాల అప్‌డేట్స్‌ వరుస కట్టాయి. ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల సొంత బ్యానర్‌పై చిరంజీవి నటించనున్న చిత్రంపై క్లారిటీ వచ్చేసింది. ఈ మేరకు గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ట్వీట్‌ చేసింది.

‘‘నాలుగు దశాబ్దాలుగా వెండితెరను శాసిస్తున్న రాజసం.

తెరపైనే కాకుండా బయట కూడా బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి.

తన తర్వాత సినిమా చిరంజీవి 156 (Megastar156) మా బ్యానర్‌లో చేస్తున్నారని తెలియజేయడానికి సంతోషంగా ఉంది’’ అని ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ (gold box Entertainments) ట్వీట్‌ చేసింది. ఈ సినిమాకు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి దర్శకుడు అతనా కాదా అన్నది నిర్మాణ సంస్థ వెల్లడించలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. (Sushmita Konidela)

చిరు 157వ చిత్రం గురించి కూడా అప్‌డేట్‌ వచ్చింది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై చిరంజీవి 157వ సినిమా రానుంది. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. మెగాస్టార్‌ కోసం పంచభూతాలు ఏకం కానున్నాయి అని తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో చెప్పారు. చిరంజీవి కోసం వశిష్ఠ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-08-22T12:22:55+05:30 IST