Chandra Mohan Funeral: చంద్రమోహన్ అంత్యక్రియలు రేపు ఉదయం పంజాగుట్ట స్మశానవాటికలో

ABN , First Publish Date - 2023-11-12T19:20:02+05:30 IST

చంద్రమోహన్ అంత్యక్రియలు రేపు పంజాగుట్ట స్మశానవాటికలో ఉదయం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియచేసారు. చంద్రమోహన్ పార్థివదేహం ఇంటి నుండి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు తీసుకువెళతామని చెప్పారు. చంద్రమోహన్ పెద్ద కుమార్తె అమెరికా నుండి ఈరోజు రాత్రికి హైదరాబాదు చేరుకుంటారని తెలిసింది.

Chandra Mohan Funeral: చంద్రమోహన్ అంత్యక్రియలు రేపు ఉదయం పంజాగుట్ట స్మశానవాటికలో
Chandra Mohan funeral will take on Monday morning at Punjagutta burial ground

చంద్రమోహన్ అంత్యక్రియలు రేపు సోమవారం హైదరాబాదులోని పంజాగుట్ట స్మశాన వాటికలో జరుగుతాయని చంద్రమోహన్ కుటుంబీకులు తెలియచేసారు. అమెరికా నుండి చంద్రమోహన్ (Chandra Mohan) పెద్ద కుమార్తె ఈరోజు రాత్రికి హైదరాబాదు చేరుకుంటారని తెలిసింది. (Chandra Mohan funeral is on Monday)

chandramohananjalidevi.jpg

రేపు ఉదయం చంద్రమోహన్ పార్థివశరీరాన్ని అతని ఇంటి దగ్గర నుండి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు తరలిస్తారని తెలిస్తోంది. కొన్ని మీడియాలో తెలుగు ఫిలిం ఛాంబర్ (TeluguFilmChamberOfCommerce) దగ్గర ఉదయం కొద్దిసేపు ఉంచుతారు అన్న వార్తలు వస్తున్నాయని, ఆ వార్తలు నిజం కాదని నేరుగా ఇంటి నుండి పంజా గుట్ట తీసుకువెళతామని చెప్పారు.

chandramohanrangularatnam.jpg

పరిశ్రమలో చాలామంది ఇప్పటికే చంద్రమోహన్ ఇంటికి వచ్చి అతనికి నివాళులు అర్పించారని, రెండు రోజులు అయిపోయిందని, అందుకని తెలుగు ఫిలిం ఛాంబర్ దగ్గర ఆగకుండా ఇంటి నుండి నేరుగా పంజాగుట్ట స్మశానవాటికకి తరలిస్తారని కుటుంబ వర్గాలు చెప్పాయి. (Chandra Mohan funeral is going to take place at Punjagutta burial ground) చంద్రమోహన్ శనివారం ఉదయం హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. (Chandra Mohan is passed away on Saturday morning)

Updated Date - 2023-11-12T19:20:03+05:30 IST