Bhagavanth Kesari: భ‌గ‌వంత్ కేస‌రి మ‌రో రికార్డు.. 6 రోజుల్లో మిలియ‌న్ టికెట్స్‌

ABN , First Publish Date - 2023-10-25T11:12:05+05:30 IST

భ‌గ‌వంత్ కేస‌రి సినిమా తాజాగా మ‌రో రికార్డును సాధించింది. అన్‌లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్ ఫాం బుక్‌మైషోలో కేవ‌లం 6 రోజ‌ల్లో 1 మిలియ‌న్ ప్రేక్ష‌కులు టికెట్లు బుక్ చేసుకున్నార‌ని, ఇది ఓ రికార్డ్ అని పేర్కొంటూ బుక్ మైషో సోష‌ల్‌మీడియాలో వేదిక‌గా ఓ పోస్టు చేయ‌గా ఇప్పుడు ట్రెండింగ్‌లో దూసుకెళుతుంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

Bhagavanth Kesari: భ‌గ‌వంత్ కేస‌రి మ‌రో రికార్డు.. 6 రోజుల్లో మిలియ‌న్ టికెట్స్‌
Balakrishna

ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా విడుద‌లైన బాలకృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి థియేట‌ర్ల వ‌ద్ద విజయదుందుభి మోగిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని చోట్లా మంచి టాక్‌తో దూసుకుపోతుంది. చిత్రంలో బాల‌కృష్ణ తెలంగాణ మాండ‌లికంలో మాట్లాడ‌డం, స్టైల్‌కు భిన్నంగా విజ్జి పాప‌గా చేసిన శ్రీలీలతో కలిసి పండించిన అద్భుతమైన నటనను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా ద‌ర్శ‌కుడు అమ్మాయిల విష‌యంలో న‌ట‌సింహంతో చెప్పించిన‌ బ్యాడ్ ట‌చ్‌, గుడ్ ట‌చ్ వంటి స‌న్నివేశాలు బాగా ఆక‌ట్టుకుంటుండ‌డంతో మ‌హిళ‌లు కూడా ఈ చిత్రాన్ని బాగా ఆద‌రిస్తున్నారు. దీంతో ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచి వంద కోట్ల క్ల‌బ్‌లోకి దూసుకెళ్లింది.

విడుద‌లైన అన్ని చోట్ల నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు, న‌టీన‌టులు ముందుకు వ‌చ్చి మ‌రీ ప్ర‌మోష‌న్స్‌ను పెంచేశారు. చిత్రం విడుద‌లైన మ‌రుస‌టి రోజే స‌క్సెస్ పార్టీ అని ఆ త‌రువాత బ్లాక్‌బ‌స్ట‌ర్ ధావ‌త్ అంటూ హంగామా చేస్తున్నారు. అదేవిధంగా ముందే బాల‌కృష్ణ‌, కాజ‌ల్‌, శ్రీలీల‌లపై చిత్రీక‌రించిన ‘దంచ‌వే మేన‌త్త కూతురా’ పాట‌ను టైటిల్ ఎండ్ కార్డ్స్‌లో జ‌త చేశారు. అంతేకాకుండా నిర్మాత దిల్ రాజుతో, వాల్తేర్ వీర‌య్య ద‌ర్శ‌కుడు బాబీల‌తో చిత్ర విజ‌యంపై ప్రత్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి ఈ సినిమా మ‌రింత‌గా జ‌నాల్లోకి వేళ్లేలా చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ. 104 కోట్ల గ్రాస్ సాధించి రికార్డులు తిర‌గ‌రాస్తుండ‌డంతో అస‌లు సిస‌లు ద‌స‌రా విజేత భ‌గ‌వంత్ కేస‌రి అంటూ నిర్మాత‌లు ప్ర‌క‌టించేశారు.


Balakrishna.jpg

అయితే భ‌గ‌వంత్ కేస‌రి సినిమా తాజాగా మ‌రో రికార్డును సాధించింది. అన్‌లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్ ఫాం బుక్‌ మై షోలో కేవ‌లం 6 రోజ‌ల్లో 1 మిలియ‌న్ ప్రేక్ష‌కులు టికెట్లు బుక్ చేసుకున్నార‌ని, ఇది ఓ రికార్డ్ అని పేర్కొంటూ బుక్ మై షో సోష‌ల్‌మీడియాలో వేదిక‌గా ఓ పోస్టు చేయ‌గా ఇప్పుడు ట్రెండింగ్‌లో దూసుకెళుతుంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

Updated Date - 2023-10-25T11:18:10+05:30 IST