Bhagavanth Kesari Box Office: ఐదో రోజు షాకింగ్ కలెక్షన్స్, దసరా విన్నర్ దిశగా...

ABN , First Publish Date - 2023-10-24T12:28:35+05:30 IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటించిన 'భగవంత్ కేసరి' ఐదో రోజు కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా దసరా విజేతగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పవచు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

Bhagavanth Kesari Box Office: ఐదో రోజు షాకింగ్ కలెక్షన్స్, దసరా విన్నర్ దిశగా...
Balakrishna from Bhagavanth Kesari film

నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) నటించిన 'భగవంత్ కేసరి' #BhagavanthKesari నిన్న సోమవారం కలెక్షన్స్ అదరగొట్టింది అనే చెప్పాలి. నిన్న సెలవు దినం కావటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్స్ బాగానే చేసింది. ఐదో రోజు నాడు ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో మొత్తం రూ. 4.30 కోట్లు షేర్ కలెక్టు చేసి, ఐదో రోజు కూడా ఇంత పెద్ద కలెక్షన్స్ రాబట్టడంలో ఈ సినిమా దసరా విజేతగా నిలుస్తుంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

ఈ ఐదో రోజు కలెక్షన్స్ తో మొత్తం ఈ సినిమా ఐదు రోజులకు గాను రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.28.38 కోట్ల షేర్ కలెక్టు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా స్ట్రాంగ్ గా వుంది. మంగళవారం కూడా సెలవు దినం కావటంతో ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో ఇంకా మంచి షేర్ సంపాదిస్తుంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అలాగే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజులకు గాను మొత్తం రూ.36.58 కోట్ల షేర్ సంపాదించింది. అదే గ్రాస్ అయితే రూ. 63.40 కోట్ల రూపాయలు.

balakrishna-bhagavanthkesar.jpg

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి ముందు రూ. 64.5 కోట్ల రూపాయలు వ్యాపారం చేసింది. అంటే సుమారు ఇంకో రూ.28 కోట్ల రూపాయలు షేర్ కలెక్టు చెయ్యాలని చెపుతున్నారు. మంగళవారం కూడా ఈ సినిమా కలెక్షన్స్ బాగానే వుంటాయని ఆశిస్తున్నారు. ఇక వేరే సినిమాల టాక్ అంతగా లేకపోవటంతో ఈ సినిమాకి అది ప్లస్ అయిందని కూడా తెలుస్తోంది. ఈ సినిమా ఇలాగె కానక బాక్స్ ఆఫీస్ దగ్గర కంటిన్యూ అయితే ఈ వారం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెపుతున్నారు. #TollywoodBoxOffice

ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు (AnilRavipudi), కాజల్ అగర్వాల్ (KajalAgarwal) కథానాయిక, శ్రీలీల (Sreeleela) ఒక ప్రముఖ పాత్ర పోషించింది. ఇందులో బాలకృష్ణ చెప్పిన గుడ్ టచ్, బేడ్ టచ్ సన్నివేశానికి విపరీతమైన ప్రసంశలు వస్తున్నాయి. సాంఘీక మాధ్యమంలో ఆ సన్నివేశం గురించి ఎక్కువ వైరల్ అవటం ఆసక్తికరం.

Updated Date - 2023-10-24T12:28:35+05:30 IST