NandamuriBalakrishna: బాబీతో సినిమా రెడీగా వుంది

ABN , First Publish Date - 2023-05-16T13:47:41+05:30 IST

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ అవుతోంది. దీని తరువాత బాలకృష్ణ 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీ తో చేస్తున్నాడు అని తాజా సమాచారం

NandamuriBalakrishna: బాబీతో సినిమా రెడీగా వుంది

నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడితో (AnilRavipudi) చేస్తున్న సినిమా షూటింగ్ దశలో వుంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఏమీ పెట్టలేదు కానీ ప్రస్తుతానికి దీన్ని ఎన్ బి కె 108 #NBK108 అని అంటున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ (KajalAggarwal) కథానాయకురాలు గా నటిస్తుండగా, శ్రీలీల (Sreeleela) బాలకృష్ణకి కూతురుగా వేస్తోంది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ ఎవరితో సినిమా చేస్తున్నారు అన్న సందేహం బాలకృష్ణ అభిమానులకు, అలాగే మిగతా వాళ్ళకి కూడా కుతూహలంగా వుంది.

balakrishna.jpg

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా అవగానే దర్శకుడు కె ఎస్ రవీంద్ర (బాబీ) (KS Ravindra) తో చేస్తున్నాడు అని తెలిసింది. #Bobbt ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిసింది. దర్శకుడు బాబీ, రచయిత కోన వెంకట్ (KonaVenkat) ఇద్దరూ ఈ సినిమాకి కథను తయారుచేస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయ్యేసరికి బాబీ కథ రెడీ చేసి పెడతాడని తెలుస్తోంది.

బాబీ ఇంతకు ముందు చిరంజీవి (MegaStar Chiranjeevi) తో 'వాల్తేరు వీరయ్య' (WaltairVeerayya) అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందించాడు. అందులో రవితేజ (RaviTeja) కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఇప్పుడు బాలకృష్ణ తో చేసే అవకాశం బాబీ కి వచ్చింది, అందుకని ఈ కథని ఇంకా పకడ్బందీగా తయారుచేసుకుంటున్నాడు. దీని తరువాత బాబీ, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో సినిమా చేస్తున్నాడు అని తెలిసింది.

Updated Date - 2023-05-16T13:47:41+05:30 IST