Bhagavanth Kesari : దాసరి ఉండుంటే బాగుండేది.. ఆ లోటు కనిపిస్తుంది!

ABN , First Publish Date - 2023-11-10T11:05:13+05:30 IST

ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావును గుర్తు చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. 'ఆయన లేని లోటు పరిశ్రమలో ఉంది. ఆయన కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది! పరిశ్రమకు పెద్దదిక్కుగా, తలలో నాలుకలా ఉండేవారంటూ' భావోద్వేగానికి లోనయ్యారు.

Bhagavanth Kesari : దాసరి ఉండుంటే బాగుండేది.. ఆ లోటు కనిపిస్తుంది!

ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావును(Dasari Narayanarao) గుర్తు  చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ (NBK). 'ఆయన లేని లోటు పరిశ్రమలో ఉంది. ఆయన కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది! పరిశ్రమకు పెద్దదిక్కుగా, తలలో నాలుకలా ఉండేవారంటూ' భావోద్వేగానికి లోనయ్యారు. నాన్నగారితో ఎన్నో సినిమాలు తెరకెక్కించిన రాఘవేంద్రరావు గారు ఈ కార్యక్రమానికి రావడంతో నిండుదనం వచ్చింది అని అన్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth kesari). అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో కాజల్‌(Kajal), శ్రీలీల కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో వేడుక నిర్వహించింది. కె రాఘవేంద్రరావు, నిర్మాత అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి జ్ఞాపికలు అందజేశారు. (Shreeleela)

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘తెలుగు, ప్రేక్షకులకి ప్రత్యేకమైన అభిలాష, అభిరుచి ఉంటుంది. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. వాళ్లు అడిగేవరకు ఆగకుండా మనమే ముందడుగు వేస్తె ఆ ఫలితం ఈ సినిమాలా ఉంటుంది. ఒక మంచి సినిమాని ఇచ్చినప్పుడు ప్రేక్షకులు నీరాజనాలు పలికారంటే అంతకుమించిన సంపద, సంతోషం ఏదీ ఉండదు. వైవిధ్యమైన పాత్రల్ని చేేస దమ్ము, ధైర్యం, నమ్మకం మా నాన్న నుంచి వచ్చిన వారసత్వం. నా సినిమాలతో నా సినిమాలకే పోటీ. ఏదైనా సందేశం ఇవ్వాలంటే సినిమాను మించిన మీడియా ఏదీ లేదు. నా వరకూ మూడు తరాలుగా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నానంటే నా పూర్వజన్మ సుకృతం. చేసే విభిన్నమైన పాత్రలు, నిర్మాతలకి నాపైన ఉన్న నమ్మకం, దర్శకులు నన్ను మలిచే కోణం, రచయితలు నాతో పలికించే మాటలు వీటన్నిటి ఫలితమే ఈ సక్సెస్‌. మాలో చాలా మందికి ఈ సినిమా ప్రత్యేకం. ‘అఖండ,’ ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’ నాకు సవాల్‌ విసిరిన సినిమాలే. బాలకృష్ణ సినిమా అంటే వేరు. షడ్రుచులు ఉండాలి, అలాంటి సినిమాని అనిల్‌ రావిపూడి ఇచ్చారు. ఒక మంచి సందేశం ఇస్తున్నాం అన్నప్పుడు దేనికేౖనా సిద్థపడాలి. అందుకే నేను చిచ్చాగా నటించా. అలాంటప్పుడే మనం చెప్పింది ప్రజల్లోకి బలంగా వెళుతుంది. ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్లు ఆనందంగా ఉంటేనే పరిశ్రమ బాగుంటుంది. ఈ చిత్రం హిందీలోనూ విడుదలవుతుంది. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పా’’ అని అన్నారు.

Bhagavanth-kesari--(2).jpg

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘భగవంత్ కేసరి’గా బాలకృష్ణని చూసినప్పుడు నాకు ఎన్టీఆర్‌ గుర్తొచ్చారు. విజ్జి పాప తన గురించి మాట్లాడే సన్నివేశంలో చాలా బాగా చేశాడు. బాలయ్య విజయపతాకం ఎగురుతూనే ఉండాలి. డ్యాన్స్‌ అయినా, ఫైట్‌ అయినా, సెంటిమెంట్‌ సన్నివేశాలైనా శ్రీలీల అవలీలగా చేస్తుంది’’ అని అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘ఆరేళ్ల నుంచి అరవయ్యేళ్ల వరకు అందరూ కలిసి కుటుంబ సమేతంగా చూస్తున్న సినిమా. నా కెరీర్‌లో గొప్ప సినిమా అయ్యింది. ప్రపంచకప్‌లో భారత్‌ జట్టు ఎంత ఫామ్‌లో ఉందో, బాలయ్యబాబు అంత ఫామ్‌లో ఉన్నారు. అవార్డుల గురించి నాకు పెద్దగా తెలియదు. వాటికి మనసుంటే బాలకృష్ణ, శ్రీలీల దగ్గరికి రావాలి’’ అని అన్నారు.

Bhagavanth-kesari--(1).jpg

Updated Date - 2023-11-10T12:29:37+05:30 IST