Bhagavanth Kesari: కలిసి మాట్లాడతా అన్నా గదా, అంతలోనే మందిని పంపాలా

ABN , First Publish Date - 2023-09-28T16:54:44+05:30 IST

బాలకృష్ణ అనుకున్న టైముకే 'భగవంత్ కేసరి' షూటింగ్ పూర్తి చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల అవుతుందని ఈ సందర్భంగా ఒక ప్రచార వీడియోని చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు.

Bhagavanth Kesari: కలిసి మాట్లాడతా అన్నా గదా, అంతలోనే మందిని పంపాలా
Balakrishna from Bhagavanth Kesari film

నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna), అనిల్ రావిపూడి (AnilRavipudi) కాంబినేషన్ లో వస్తున్న 'భగవంత్ కేసరి' #BhagavanthKesari సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల అవుతుందని ఆ చిత్ర నిర్వాహకులు షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా ఒక ప్రచార వీడియో విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela), బాలకృష్ణ కుమార్తెగా నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ (KajalAggarwal) కూడా ఇంకో ముఖ్య పాత్రలో కనపడనుంది. ఈ సినిమా పూర్తవుతుందా అవదా, అక్టోబర్ 19న విడుదలవుతుందా అవదా అని అనేక వార్తలు సాంఘీక మాధ్యమాల్లో కనిపిస్తుండగా, ఈ వీడియో వాటన్నిటీకే సమాధానంగా వుంది.

ఈసారి దసరాకి (Dasara) బాలకృష్ణ అభిమానులకి పండగే పండగ అని చెప్పొచ్చు. అటు ఎన్ని రాజకీయ ఒత్తిడులు వున్నా, బాలకృష్ణ ఈ సినిమాని అనుకున్న సమయంలోనే పూర్తి చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలకృష్ణలోని ఇంకో కోణాన్ని చూపించబోతున్నారు అని అంటున్నారు. అలాగే ఇందులో బాలకృష్ణ యాస కూడా వేరేలా వుండబోతోంది అని తెలుస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే పాట విడుదలైంది, అలాగే కొన్ని ప్రచార చిత్రాలు కూడా విడుదలయ్యాయి, అవన్నీ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

bhagavanthkesari-poster.jpg

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (ArjunRampal) నెగటివ్ రోల్ లో కనపడనున్నాడు. ఈ సినిమాకి నిర్మాతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి. అలాగే దీనికి సంగీతం థమన్ (SSThaman) అందించాడు. యాక్షన్ సినిమాలకి నేపధ్య సంగీతం థమన్ బాగా ఇస్తాడు అని పేరు వుంది, అందులోకీ ఇది బాలకృష్ణ సినిమా అంటే, ఇంకా అది హై పిచ్ లో వుండబోతోంది అని కూడా తెలుస్తోంది. అలాగే ఈ ప్రచార వీడియోలో బాలకృష్ణ డైలాగ్ 'కలిసి మాట్లాడతా అన్నాగదా, అంతలోనే మందిని పంపాలా' ఎవరినుద్దేశించి అన్నారు అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.

Updated Date - 2023-09-28T16:54:44+05:30 IST