Anasuya Bharadwaj : రంగమ్మత్త కాదు.. ఇకపై అలాగే పిలుస్తారు!

ABN , First Publish Date - 2023-09-22T12:45:33+05:30 IST

బుల్లితెరపై హాట్‌ యాంకర్‌గా కుర్రకారు మతి పోగొట్టిన అనసూయ ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త పాత్రతో తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టింది. అక్కడి నుంచి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. ‘పుష్ప’, ‘విమానం’ తదితర చిత్రాలతో అనసూయ నటిగా తనదైన ముద్ర వేశారు.

Anasuya Bharadwaj : రంగమ్మత్త కాదు.. ఇకపై అలాగే పిలుస్తారు!

బుల్లితెరపై హాట్‌ యాంకర్‌గా కుర్రకారు మతి పోగొట్టిన అనసూయ (Anasuya) ‘రంగస్థలం’ (Rangastalam) చిత్రంలో రంగమ్మత్త పాత్రతో తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టింది. అక్కడి నుంచి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. ‘పుష్ప’, ‘విమానం’ తదితర చిత్రాలతో అనసూయ నటిగా తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఆమె ‘పెదకాపు 1’(Peda kapu 1) లో నటించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా అనసూయ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘పెదకాపు 1’ విడుదల తర్వాత ఇందులోని పాత్ర పేరుతోనే తనను పిలుస్తారని అనసూయ చెప్పారు.

‘‘రంగమ్మత్త క్యారెక్టర్‌ తర్వాత. అందుకు దీటుగా ఉండే పాత్రలనే ఎంచుకుంటున్నా. నుదుటిపై ఓ పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించేసరికి మళ్లీ రంగమ్మత్త అనే అంటున్నారు. ‘పెదకాపు 1’ నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన మరో కథ. శ్రీకాంత్‌ అడ్డాల అనగానే ఆయన తరహా కథల్నే ఊహించుకుంటాం. కానీ ఆయన రూట్‌ మార్చారు. ఈ సినిమాతో ఓ కొత్త తరహా కథతో ఈ సినిమా చేశారు. ఇందులో నా పాత్రే కాదు.. అందరి పాత్రలు బలంగానే ఉంటాయి. నాతోపాటు ఇతర భాషల నుంచి కూడా కొందరిని పరిగణనలోకి తీసుకుని ఆడిషన్స్‌ చేశారని ఆ తర్వాత తెలిసింది. అలాంటి పాత్ర కోసం ఆడిషన్‌ ఇచ్చి ఎంపికయ్యాననే తృప్తి ఉంది. నాతో సహా ఈశ్వరీరావు, ప్రగతి, బ్రిగిడ... ఇలా ఫీమేల్‌ ఆర్టిస్ట్‌లందరి పాత్రలు బలంగా ఉంటాయి. నా పాత్ర, నేను చెప్పే డైలాగ్‌లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

చాలా మిస్‌ అవుతున్నా..

నాకు ఒకే జానర్‌ పాత్రలు చేయడం నచ్చదు. అన్ని రకాలూ చేయాలనుకుంటా. అమ్మమ్మ పాత్రకైనా నేను సిద్థమే. కాకపోతే సినిమా విడుదల తర్వాత అమ్మమ్మ గురించి మాట్లాడుకునేలా ఉండాలి. బుల్లితెర నుంచి వచ్చి ఓ తెలుగమ్మాయిగా ఈ స్థ్థాయికి చేరుకున్నా. టెలివిజన్‌ని మిస్‌ అవుతున్నానే భావన కలుగుతోంది. కానీ అప్పుడప్పుడూ ఏదో ఒక షో గురించి అడుగుతూనే ఉంటారు. డేట్స్‌ కుదరక, కొన్నిసార్లు కాన్సెప్టులు కుదరక చేయడం లేదు. నాకు నచ్చిన కాన్సెప్ట్స్‌ వస్తే మళ్లీ టెలివిజన్‌ రంగంలో సందడి చేస్తా’’ అని అన్నారు.

Updated Date - 2023-09-22T12:52:06+05:30 IST