AlluArjun: ఐకాన్ స్టార్ కి నచ్చిన 'సామజవరగమన', మామూలుగా స్పందించలేదుగా...

ABN , First Publish Date - 2023-07-05T14:55:58+05:30 IST

అల్లు అర్జున్ చాలా అరుదుగా వేరే వాళ్ళ సినిమాలు చూసి దాని గురించి ట్విట్టర్ లో మాట్లాడతారు. ఈమధ్య విడుదలైన 'సామజవరగమన' సినిమా చూసి, ఆ సినిమా తనకి చాలా బాగా నచ్చిందని చెపుతూ ఆ సినిమా టీముకి అభినందనలు తెలిపారు.

AlluArjun: ఐకాన్ స్టార్ కి నచ్చిన 'సామజవరగమన', మామూలుగా స్పందించలేదుగా...
Allu Arjun

ఐకాన్ స్టార్ (IconStar) అల్లు అర్జున్ (AlluArjun) 'పుష్ప 2' #Pushpa2 షూటింగ్ లో చాలా బిజీగా వున్నారు. అయినా మధ్యలో కొంచెం టైము తీసుకొని శ్రీవిష్ణు (SreeVishnu), రెబా మోనికా జాన్ (RebaMonicaJohn) జంటగా నటించిన 'సామజవరగమన' #Samajavaragamana సినిమా చూసారు. అల్లు అర్జున్ చాలా అరుదుగా వేరే వాళ్ళ సినిమాలు చూసి, ఆ సినిమా గురించి తన సాంఘీక మాధ్యమం లో పోస్ట్ చేస్తారు. అయితే ఈ సినిమా చాలా నచ్చేసింది అల్లు అర్జున్ కి, అందుకని తన అభిప్రాయాన్ని వెంటనే చెప్పాలని అనుకున్నారు, అందుకే ఈ సినిమా గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు అల్లు అర్జున్.

alluarjunnewlook.jpg

"‘సామజవరగమన' మూవీ టీమ్‌కి నా అభినందనలు. చాలా కాలం తరవాత ఒక మంచి తెలుగు కుటుంబ కథా చిత్రం, ఎంటర్‌టైనర్ చూశాను. సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా నచ్చింది. దర్శకుడు రామ్ అబ్బరాజు కథను బాగా రాసుకోవటమే కాకుండా, చక్కగా తెర మీద చూపించారు. శ్రీవిష్ణు అయితే అదరగొట్టాడు, అతనికి ఈ సినిమా విజయం సాధించటం నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్లందరితో పాటు నరేష్ (VKNaresh), వెన్నెల కిషోర్ (VennelaKishore), నా మలయాళీ నటి రెబా మోనికా జాన్, అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇక ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణలకి, నిర్మాతలకి నా రెస్పెక్ట్. ఇది నూరు శాతం ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా," అని అల్లు అర్జున్ ట్వీట్‌ చేశారు.

samajavaragamana1.jpg

అల్లు అర్జున్ అప్పుడప్పుడు నటుడు శ్రీవిష్ణు ని కలిసి మాట్లాడతారని అందరికీ తెలిసిన విషయమే. అలాగే అల్లు అర్జున్ ఎప్పుడూ శ్రీవిష్ణు ఏమి చేసినా సపోర్ట్ చేస్తూ వుంటారు. అలాగే ఈ 'సామజవరగమన' సినిమాని కూడా అల్లు అర్జున్ చూసి ఇలా ట్వీట్ చెయ్యడం, ముఖ్యంగా శ్రీవిష్ణుకి, ఇతర టీము సభ్యులకి చాలా ప్రోత్సాహంగా భావిస్తూ, సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.

ఇది కూడా చదవండి:

Samajavaragamana Film Review: నవ్వుల నజరానా !

Updated Date - 2023-07-05T14:59:26+05:30 IST