Ugram: అల్లరి నరేష్ ఉగ్ర రూపం ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-01-03T20:02:11+05:30 IST

అల్లరి నరేష్‌ (Allari Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’ (Ugram). ‘నాంది’ (Naandhi) వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న..

Ugram: అల్లరి నరేష్ ఉగ్ర రూపం ఎప్పుడంటే..
Allari Naresh In Ugram Movie

అల్లరి నరేష్‌ (Allari Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’ (Ugram). ‘నాంది’ (Naandhi) వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్ ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఒక స్పెషల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ గ్లింప్స్‌లో నరేష్ బైక్ నడుపుతూ ఇంటెన్స్ గా కనిపించారు. బైక్‌ను ఆపి తుపాకీ తీసుకుని గట్టిగా అరుస్తూ ఎవరినో కాల్చడం ఆసక్తికరంగా వుంది. వీడియో చివరిలో.. ఏప్రిల్ 14న విడుదల అంటూ విడుదల తేదీ (Release Date)ని ప్రకటించారు. నరేష్ తన తుపాకీని ఒకరిపై గురిపెట్టిన పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. వీడియో, పోస్టర్ నరేష్ పాత్ర యొక్క ఉగ్ర రూపాన్ని తెలియజేస్తున్నాయి.

షైన్ స్క్రీన్స్ (Shine Screens) బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా (Mirnaa) హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి.. ‘నాంది’కి పని చేసిన దాదాపు అదే టెక్నికల్ టీం పని చేస్తోంది. తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తున్నారు . శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. (Ugram Release Date)

Updated Date - 2023-01-03T20:02:13+05:30 IST