RamCharan: అఖిల్ అనుకుంటే, నిఖిల్ వచ్చాడేంటి, అక్కినేని అభిమానుల నిరాశ

ABN , First Publish Date - 2023-05-29T13:47:08+05:30 IST

రామ్ చరణ్, తన స్నేహితుడు విక్రమ్ రెడ్డి తో ప్రారంభించిన కొత్త నిర్మాణ సంస్థ 'ది ఇండియా హౌస్' అనే సినిమాకి శ్రీకారం చుట్టింది. అధికారికంగా ఈ సినిమాని నిఖిల్ సిద్ధార్థ్ తో చేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. అయితే అఖిల్ కి అవకాశం ఇస్తున్నాడు అని వార్తలు బాగా వైరల్ అయ్యాయి, తీరా చూస్తే నిఖిల్ వున్నాడు. అక్కినేని అభిమానులు ఇప్పుడు కొంచెం నిరాశకి లోనయ్యారు అని ఒక టాక్ నడుస్తోంది.

RamCharan: అఖిల్ అనుకుంటే, నిఖిల్ వచ్చాడేంటి, అక్కినేని అభిమానుల నిరాశ

అగ్ర నటుడు రామ్ చరణ్ (RamCharan), యువి క్రియేష‌న్స్ (UVCreations) విక్ర‌మ్ రెడ్డితో (VikramReddy) కలిసి 'వీ మెగా పిక్చ‌ర్స్' (VMegaPictures) నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరితో పాటు నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ (AbhishekAgarwal) కూడా ఇందులో జాయిన్ అయ్యారు. ఈ ముగ్గరు కలిసి ఒక పాన్ ఇండియా చేద్దామని ప్లాన్ చేసి అధికారికంగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కొచ్చి పడింది. ఏంటంటే, రామ్ చరణ్, విక్రమ్ రెడ్డితో ఒక నిర్మాణ సంస్థను మొదలుపెడుతున్నారు అనగానే, అందులో మొదటగా రామ్ చరణ్ స్నేహితుడు అఖిల్ అక్కినేని (AkhilAkkineni) కి ఛాన్స్ ఇస్తాడని అనుకున్నారు అందరూ.

ramcharanakhil.jpg

అక్కినేని అభిమానులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు కూడా. గత కొన్ని రోజులుగా అఖిల్ అక్కినేనికి అవకాశం ఇస్తున్న రామ్ చరణ్ అన్న వార్తలతో సాంఘీక మాధ్యమం అంతా వైరల్ అయింది కూడా. కానీ తీరా ఈ కొత్త నిర్మాణ సంస్థ అధికారికంగా ఎవరితో చేస్తోందో అని ప్రకటన విడుదల చేసాక అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారని ఒక టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఈ సంస్థ నిఖిల్ సిద్ధార్థ్ (NikhilSiddharth) తో ఈ పాన్ ఇండియా ప్లాన్ చేసిందని అధికారికంగా ప్రకటించారు.

అధికారికంగా ఈ సంస్థ కొత్త సినిమాకి సంబంధించి ప్రకటనతో పాటు, ఒక వీడియో కూడా విడుదల చేశారు. అలాగే ఒక ప్రీ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. తీరా చూస్తే ఇవన్నీ నిఖిల్ సిద్ధార్థ్ అని తెలిసి, అఖిల్ అభిమానులు కొంచెం ఫీల్ అయినట్టుగా సమాచారం. ఎందుకంటే అఖిల్ 'ఏజెంట్' #Agent ప్లాప్ అయినా రామ్ చరణ్ ఒక మంచి అవకాశం ఇస్తున్నట్టుగా అఖిల్ అభిమానులు భావించారు. ఎందుకంటే అఖిల్ 'ఏజెంట్' ప్రచారాలు అప్పుడు రామ్ చరణ్ ని అన్న అంటూ ఎంతో పొగిడాడు. అందుకని రామ్ చరణ్, అఖిల్ కి అవకాశాం ఇస్తున్నాడేమో అనుకున్నారు.

Nikhil-Movie.jpg

కానీ చివరకు ఈ సంస్థ ప్రకటించిన ‘ది ఇండియా హౌస్’ #TheIndiaHouse అనే సినిమాలో నిఖిల్ ని తీసుకున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ కి నిఖిల్ కి వున్న సాన్నిహిత్యం తోటే నిఖిల్ కు ఈ అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది. స్వాతంత్య్ర వీరుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఇలా 'ది ఇండియా హౌస్' #TheIndiaHouse ని ప్రకటించారు. రామ్ వంశీ కృష్ణ (RamVamsiKrishna) దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో హిందీ నటుడు అనుపమ్ ఖేర్ (AnupamKher) కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - 2023-05-29T13:47:08+05:30 IST