Upendra Gadi Adda: ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి ఐదు సినిమాల టీజర్స్ విడుదల

ABN , First Publish Date - 2023-10-30T20:42:17+05:30 IST

కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్‌గా.. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను స్టార్ కమెడియన్ బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో పాటు ఇదే హీరో నటిస్తోన్న 5 చిత్రాల టీజర్స్‌ను కూడా విడుదల చేశారు.

Upendra Gadi Adda: ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి ఐదు సినిమాల టీజర్స్ విడుదల
Upendra Gadi Adda Trailer Launch

ఒక సినిమా తీయడానికే కిందమీదా పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండటం నిజంగా ఓ సంచలనం అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) అన్నారు. కంచర్ల ఉపేంద్ర (Kancharla Upendra) హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్‌గా.. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra Gadi Adda). తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో మేకర్స్ నిర్వహించారు. ఈ వేదికపై ఇదే హీరోతో తీస్తున్న ఐదు సినిమాల టీజర్లను ఒకేసారి విడుదల చేసి సంచలనాన్ని క్రియేట్ చేశారు. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ చిత్ర ట్రైలర్‌ను, నరసింహ నంది దర్శకత్వంలో ఈ నిర్మాత తీయబోతున్న ఆరవ చిత్రం ‘1920 భీమునిపట్నం’ పోస్టర్‌ను.. ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం విడుదల చేశారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. మా అబ్బాయి కూడా హీరో అనే విషయం తెలిసిందే. ఇలాంటి కొత్త హీరోలను ఆశీర్వదించినపుడు మా అబ్బాయిని కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడన్న ఉద్దేశ్యంతో ఈ ఫంక్షన్‌కు వచ్చాను. కుమారుడ్ని హీరోగా పరిచయం చేయడమే కాదు.. ఈ చిత్ర నిర్మాత అచ్యుతరావు ఒక ఫ్యాక్టరీ లాగా ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండటం అభినందనీయం. దీనివల్ల పరిశ్రమను నమ్ముకున్న వారికి అవకాశాలు ఇచ్చి, భోజనం పెట్టినట్లవుతుంది. తన కుమారుడి పట్ల ఆయనకున్న ప్రేమ, నమ్మకానికి ఇది ఓ నిదర్శనం. ఈ ఐదు సినిమాల టీజర్స్‌ను చూస్తుంటే వేటికవే విభిన్నమైన కమర్షియల్ సినిమాలుగా అనిపిస్తున్నాయి. ఈ రోజు హీరో కంచర్ల ఉపేంద్ర పుట్టినరోజు ఇంత భారీగా జరుపుకోవడం ఆనందదాయకం. అతనికి ఉజ్జ్వల భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. (Upendra Gadi Adda Trailer Launch)


UPendra.jpg

చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ.. మంచి కథలను ఎంపిక చేసుకుని, టాలెంట్‌ను గుర్తించి మరీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాలను తీస్తున్నాం. నవంబర్ నుంచి ప్రతీ నెలా ఒక సినిమాను విడుదల చేయబోతున్నాం. ఎన్నో ఏళ్లుగా విశాఖపట్నంలో మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము తీస్తున్న సినిమాల ద్వారా వచ్చే లాభాలను కూడా ప్రజా సేవా కార్యక్రమాలకు వెచ్చించదలచుకున్నాం. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ పూర్తి వినోదం, మాస్ అంశాలతో అలరింపజేస్తుందని అన్నారు. హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ.. నా పుట్టిన రోజు సందర్భంగా నాతో మా నాన్న తీస్తున్న ఐదు సినిమాల టీజర్స్‌ను విడుదల చేస్తూ, ఇంత భారీగా ఈ కార్యక్రమం జరుపుతుండటం నాకో వెలకట్టలేని పెద్ద బహుమతి. ఇంతమంది ఆత్మీయులు, శ్రేయోభిలాషుల, పరిశ్రమ వారు అందజేసిన ఆశీస్సులు నాకు వరాలు అవుతాయని ఆశిస్తున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె, హీరోయిన్ సావిత్రి కృష్ణ తదితరులు ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

========================

*Razakar: సినిమా బ్యాన్‌పై సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన ‘రజాకార్’ నిర్మాత

********************************

*Hard-Hitting Love Story: కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి.. ‘బేబీ’ మేకర్స్ తగ్గేదే లే..

*******************************

*Vignesh Shivan: ఆ సినిమా మా బ్యానర్‌కు దక్కిన సముచిత గౌరవం

*********************************

Updated Date - 2023-10-30T20:44:23+05:30 IST