18 Pages OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ మూవీ.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2023-01-27T15:43:50+05:30 IST

పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ ‘కార్తీకేయ 2’ (Karthikeya 2) మూవీ తర్వాత నిఖిల్‌ సిద్ధార్థ్ (Nikhil Siddharth), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్‌’ (18 Pages).

18 Pages OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ మూవీ.. ఎక్కడంటే..
18 Pages

పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ ‘కార్తీకేయ 2’ (Karthikeya 2) మూవీ తర్వాత నిఖిల్‌ సిద్ధార్థ్ (Nikhil Siddharth), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్‌’ (18 Pages). ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ తెరకెక్కిన ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. సుకుమార్ కథ అదించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. గతేడాది డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ విజయంతో నిఖిల్, అనుపమ ఖాతాలో రెండు హిట్స్ చేరినట్లైంది. టోటల్‌గా రూ. 25 కోట్లపైనే గ్రాస్‌ కలెక్ట్‌ చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చింది.

అయితే.. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ఆహాతో పాటు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు (శుక్రవారం)నుంచే అధికారికంగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. అందులో.. ‘సుకుమార్ గారి మ్యాజికల్ స్టోరీ, సిద్ధు నందినిలా ప్రేమ. ఆహాలో చూసేయండి’ అని రాసుకొచ్చింది. థియేటర్స్‌లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చూసేయండి మరి.

Updated Date - 2023-01-27T15:47:27+05:30 IST