Rajinikanth: తడాకా చూపిస్తున్న తలైవా, సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ ఎక్కడా రజిని మేనియానే

ABN , First Publish Date - 2023-08-12T17:46:48+05:30 IST

ఎక్కడా కూడా ఒక చిన్న ప్రచారం చెయ్యకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృషించటం ఒక్క రజినీకాంత్ కే చెల్లును అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'జైలర్' రెండు రోజులకు గాని రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. ఈ కలెక్షన్ల సునామీ కొన్ని రోజులు ఉంటుందని, ఎంత కలెక్టు చేస్తుందో వేచి చూడాల్సిందే అంటున్నారు.

Rajinikanth: తడాకా చూపిస్తున్న తలైవా, సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ ఎక్కడా రజిని మేనియానే
Rajinikanth in Jailer

రజినీకాంత్ (Rajinikanth) నటించిన 'జైలర్' #Jailer మొన్న గురువారం విడుదలైంది. ఒక్క తమిళనాడులో ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తప్ప, రజినీకాంత్ ఇంకెక్కడికీ ఆ సినిమా ప్రచారానికి వెళ్ళలేదు. నెల్సన్ దిలీప్ కుమార్ (NelsonDileepKumar) దీనికి దర్శకుడు, సన్ పిక్టర్స్ (SunPictures) అధినేత కళానిధి మారన్ (KalanidhiMaran) నిర్మాత. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పుడు తెలుగులో కూడా మామూలుగా విడుదలైంది.

rajinimania2.jpg

ఈ సినిమా నుండి అభిమానులు అంత పెద్దగా ఏమీ ఆశించకుండా వెళ్లారు, కానీ తీరా సినిమా చూసాక, రజినీకాంత్ అదరగొట్టాడు. తన నటనతో అభిమానులను మైమరపించాడు. ఈమధ్య కాలంలో వచ్చిన రజినీకాంత్ సినిమాలలో ఇది బెస్ట్ సినిమా అని అంటున్నారు. ఇందులో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ (MohanLal), కన్నడ నుండి శివ రాజ్ కుమార్ (ShivRajkumar), హిందీ నుండి జాకీ ష్రాఫ్ (JackieShroff) ప్రత్యేక పాత్రల్లో కనపడతారు. వాళ్ళు ఈ సినిమాలో ఉండటం ఈ సినిమా స్థాయి కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది అని అభిమానులు అంటున్నారు.

rajinimania3.jpg

వాళ్ళతో పాటు తమన్నా భాటియా (TamannaahBhatia), రమ్య కృష్ణ (RamyaKrishna), సునీల్ (Sunil) ఇలా అందరూ నటించారు. ఇందులో రజినీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలో అద్భుత నటన కనపరిచాడు అని అభిమానులు ఆనందంతో వున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన 'రోబో' #Robo తరువాత రజినీకాంత్ కి అంత పెద్ద హిట్ ఈ సినిమా రూపం లో వచ్చింది. కలెక్షన్ల సునామీ ఎక్కడ చూసినా, బాక్స్ ఆఫీస్ బద్దలవుతోంది, హౌస్ ఫుల్ బోర్డులు థియేటర్ గేట్స్ కి వేలాడుతున్నాయి. ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా తన సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఒక్క తలైవా కె సొంతం అని కూడా అంటున్నారు. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఎక్కడ చూసినా రజిని మేనియా (RajiniMania) కనపడుతోంది అంటున్నారు.

ఇంతకీ ఈ సినిమా ఎంత కలెక్టు చేసిందంటే, రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.145.25 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది, అంటే సుమారు రూ.72 కోట్ల షేర్ వసూల్ చేసినట్టు. ఇది ఒక రికార్డు కలెక్షన్ అని అంటున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.17.30 కోట్లు గ్రాస్ వసూల్ చేసిందని చెప్తున్నారు. విదేశాల్లో అయితే ఈ సినిమా కుమ్ముతోందని, ఇక ఈమధ్య విడుదలైన ఏ సినిమా కూడా ఇంతలా కలెక్షన్స్ రాబట్టడం లేదని చెపుతున్నారు. ఇక శని, ఆదివారాలు సెలవులు కావటంతో ఈ కలెక్షన్ల సునామీ ఆగేట్టు లేదని, కంటిన్యూ అవుతుందని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు.

ఇది కూడా చదవండి

Jailer film review: ఈసారి మాటలు కాదు, కోతలే.. ! అర్థమైందా రాజా !

Updated Date - 2023-08-12T17:46:48+05:30 IST