Jailer film review: ఈసారి మాటలు కాదు, కోతలే.. ! అర్థమైందా రాజా !

ABN , First Publish Date - 2023-08-10T15:12:01+05:30 IST

రజినీకాంత్ సినిమా 'జైలర్' విడుదలైంది. ఎక్కడ చూసిన అభిమానుల కోలాహలమే కనపడుతోంది, ఎందుకంటే రజిని అంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ అతనికి అభిమానులున్నారు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ 'జైలర్' అభిమానులని అలరించిందో లేదో చదవండి.

Jailer film review: ఈసారి మాటలు కాదు, కోతలే.. ! అర్థమైందా రాజా !
Jailer Film Review

సినిమా: జైలర్

నటీనటులు: రజనీకాంత్, రమ్య కృష్ణన్, మిర్న మీనన్, వసంత్ రవి, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, వినాయకన్, తమన్నా భాటియా, విటివి గణేష్, నాగబాబు, యోగిబాబు తదితరులు

ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్ కన్నన్

సంగీతం: అనిరుధ్ రవిచందర్

నిర్మాత: కళానిధి మారన్

రచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్

-- సురేష్ కవిరాయని

రజినీకాంత్ #Rajinikanth సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తూ వుంటారు. ఒక్క తమిళంలోనే కాదు, అన్ని భాషల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ అతనికి అభిమానులు వున్నారు. అలాగే రజినీకాంత్ ముందు సినిమా హిట్ అయిందా, ఫట్ అయిందా అని కూడా చూడరు, రజినీకాంత్ సినిమా విడుదలవుతోంది అంటే చాలు, అభిమానులు వెల్లువలా మొదటి రోజు చూడాల్సిందే. అలా ఉంటుంది సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్. ఇప్పుడు అతను 'జైలర్' #JailerFilmReview అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెల్సన్ దిలీప్ కుమార్ (NelsonDileepKumar) దీనికి దర్శకుడు, అలాగే సన్ పిక్టర్స్ (SunPictures) అధినేత కళానిధి మారన్ (KalanidhiMaran) దీనికి నిర్మాత. ఈ సినిమా బడ్జెట్ కూడా సుమారుగా రూ. 200 కోట్ల వరకు అయిందని అంటున్నారు. ఇందులో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ (MohanLal), కన్నడ నటుడు శివరాజ్ కుమార్ (ShivRajkumar), అలాగే హిందీ నటుడు జాకీ ష్రాఫ్ (JackieShroff) ప్రత్యేక అతిధి పాత్రల్లో కనపడతారు. అలాగే రమ్యకృష్ణ (RamyaKrishnan) చాలా కాలం తరువాత రజినీకాంత్ సినిమాలో చేసింది. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ (AnirudhRavichander) సంగీతం ఇచ్చాడు. ఇక ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Jailer.jpg


Jailer story కథ:

ముత్తు లేదా ముత్తు వేల్ పాండియన్ (రజనీకాంత్) అనే అతను పదవీ విరమణ చేసిన ఒక జైలు అధికారి. అతనికి ఒక కుమారుడు అర్జున్ (వసంత్ రవి), అతను అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ గా భాద్యతలు నిర్వహిస్తుంటాడు. ముత్తు భార్య (రమ్యకృష్ణ), కోడలు (మిర్న మీనన్), అలాగే మనవడితో పదవీ విరమణ చేసాక తన శేష జీవితం హాయిగా గడుపుతూ ఉంటాడు. అర్జున్ పురాతన దేవాలయాల్లో విగ్రహాలను దొంగిలించి విదేశాలకు అమ్ముతున్న ఒక మాఫియా ముఠాను పట్టుకోవాలని నాలుగున్నరేళ్లుగా దర్యాప్తు చేస్తూ ఉంటాడు. ఇలా దర్యాప్తు చేస్తున్న సమయంలో అతనికి ఒక చిన్న ఆధారం దొరుకుంటుంది. అది దొరికిన మరుసటి రోజు నుండీ అర్జున్ కనపడకుండా పోతాడు. #JailerReview అర్జున్ మరణించాడని పోలీస్ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చేస్తారు, అదే విషయాన్ని ముత్తుకి, కుటుంబానికి చెప్తారు. కుమారుడి మరణించాడనే విషయం ముత్తుకు చాలా బాధ కలిగించటమే కాకుండా, నిద్రలేకుండా చేస్తుంది. #JailerFilmReview కుమారుడిని ఎవరు చంపారు, ఇలా దేవుడి విగ్రహాలను దొంగతనం చేసే ముఠా ఎవరు, వాళ్ళ గురించి ఆచూకీ మొదలెట్టి, ఇక వారి అంతు చూడటానికి తన మిత్రుల సాయంతో ముందుకి వెళతాడు. మాఫియా ముఠా నాయకుడు వర్మ (వినాయకన్) కి విషయం తెలిసి ముత్తు కుటుంబానికి హాని తలపెట్టబోతాడు. కుమారుడు మరణించాడు అనే విషయం ఒకటి, తన కుటుంబాన్ని ఆ ముఠా నుండి కాపాడుకోవాలి అనేది రెండోది, ఇలా ఈ రెండింటి కోసం ఇంట్లో చిన్నపిల్లాడుతో ఆడుకుంటూ, సాత్వికంగా వుండే ముత్తు ఎటువంటి మనిషిగా మారతాడు, ఎలా ఆ ముఠాని అంతం చేస్తాడు, దాని నాయకుడిని ఎలా పట్టుకుంటాడు అని ఆసక్తికరంగా సాగే మిగతా సినిమా కథ.

Rajinikanth.gif

విశ్లేషణ:

ముందుగా దర్శకుడు నెల్సన్ కి శుభాకాంక్షలు చెప్పాలి, అలాగే అతని తెలివితేటలకు మెచ్చుకోవాలి. #JailerReview ఎందుకంటే రజనీకాంత్ #Rajinikanth సినిమాలు ఇంతకు ముందు చాలా వచ్చాయి, వెళ్లాయి, కానీ ఈ 'జైలర్' #Jailer సినిమాలో రజనీకాంత్ ని దర్శకుడు నెల్సన్ వాడుకొన్నట్టు ఎవరూ వాడుకోలేదు, అలాగే ఎవరూ చూపించలేదు. ఈ సినిమాలో దర్శకుడు రజినీకాంత్ వయస్సుకి తగ్గ పాత్ర రాయటమే కాకుండా, రజనీకాంత్ చేత పెద్దగా పోరాట సన్నివేశాలు ఏమీ చేయించకుండానే, ప్రతి సన్నివేశంలో రజనీకాంత్ ని ఎలివేట్ చేసేట్టు చూపించాడు. అది దర్శకుడు ప్రజ్ఞకి ఒక మంచి ఉదాహరణ. రజనీకాంత్ అభిమానులు అతన్ని ఎలా చూడాలని అనుకుంటున్నారో వాళ్ళ అంచనాలకు తగ్గకుండా చూపించటమే కాకుండా, కథలో రజనీకాంత్ వయస్సుకు తగ్గ పాత్ర చేయించాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్న ఒక సూపర్ స్టార్, అతని ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని, అలాగే అతని వయసుని కూడా చూసుకొని, ఈ ముత్తు అనే పాత్ర చాలా బాగా డిజైన్ చెయ్యడం అనేది ఈ సినిమా దర్శకుడి నెల్సన్ ప్రజ్ఞా పాటవాలకు ఒక మచ్చు తునక.

అలాగే ఈ సినిమా కథ కూడా చాలా చిన్నదే. దేవతా విగ్రహాలను ఒక మాఫియా ముఠా దొంగిలించి విదేశాలకు డబ్బులు కోసం రవాణా చేస్తూ ఉంటుంది. అది పట్టుకోవటానికి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ దర్యాప్తు చేస్తాడు, అతనికి ఒక క్లూ దొరుకుతుంది, కానీ ఆశ్చర్యంగా మర్నాడు నుండి అతను కనపడకుండా పోతాడు. అతని తండ్రి ఒక పదవీ విరమణ చేసిన జైలు అధికారి, కొడుకుని చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకున్నప్పుడు ఎదురైన సంఘటనలు ఏంటి అన్నది దర్శకుడు చాలా ఆసక్తికరంగా చూపించాడు. #JailerReview అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లను కూడా బాగా వాడుకున్నాడు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఈ సినిమాకి అంత అవసరం లేదు కానీ, హంగామా కోసం వాళ్ళ చేత చిన్న చిన్న పాత్రలు వేయించాడు. #JailerFilmReview అది బాగా క్లిక్ అయింది సినిమాలో. మాఫియా, కుటుంబం, ప్రతీకారం ఇవన్నీ కలబోసి తీసిన ఒక వ్యాపారాత్మకమైన సినిమాగా ఇది చెప్పొచ్చు.

Tamanna.jpg


అలాగే హాస్య సన్నివేశాలు వేరేగా ఏమీ లేకుండా రజనీకాంత్-విటి గణేశన్, రజనీకాంత్-యోగిబాబు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా హిలేరియస్ గా ఉంటాయి. ఇంట్లో ఒక పోరాట సన్నివేశం ఉంటుంది. రజినీకాంత్, రమ్యకృష్ణ, మిర్న మీనన్ ఇంట్లో ఉండగా కొంతమంది రౌడీలు ఆ ఇంట్లో ప్రవేశించి వీళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు. ఆ మొత్తం ఎపిసోడ్ అదిరింది అనే చెప్పాలి, అందులో కూడా రజినీ ఎలివేషన్ బాగుంటుంది. అలాగే విలన్ దగ్గరకి రజనీకాంత్ వెళ్ళినప్పుడు, విలన్ కొంతమంది రౌడీలను తెచ్చి పెట్టుకుంటాడు, అయితే అప్పుడు రజినీకాంత్ ని వేసెయ్యడానికి బదులు సన్నివేశం రివర్సు అవుతుంది, ఆ సన్నివేశం కూడా రజినిని ఎలివేట్ చేసేదిగా ఉంటూ అభిమానులచేత ఈలలు, గోలలు చేయించేదిగా ఉంటుంది. #JailerFilmReview అలాంటి సన్నివేశాలు చాలా వున్నాయి. అలాగే ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే క్లైమాక్స్. చాలా బాగా తీసాడు దర్శకుడు, అది హైలైట్ అనే చెప్పాలి. రజినీకాంత్ ని ఎలా చూపిస్తే బాగుంటుందో, అటు అభిమానులకు, ఇటు రజిని వయసుకు తగ్గ పాత్రని డిజైన్ చేసి అందరినీ సంతృప్తి పరచడంలో దర్శకుడు నెల్సన్ సఫలీకృతుడు అయ్యాడనే చెప్పాలి. #JailerReview అయితే రెండో సగంలో చిన్న చిన్న సాగదీసే సన్నివేశాలున్నా సినిమా ఆసక్తికరంగా ఉండటంతో అవన్నీ పాస్ అయిపోతాయి. అలాగే రెండో సగంలో రజనీకాంత్ చుట్టని తన స్టైల్ లో వెలిగించి చూపించటం ఇంకో హైలైట్.

jailerreview3.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే రజినీకాంత్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. #JailerReview అతను వయసుకి తగ్గ ఈ ముత్తు పాత్రలో ఒదిగిపోయాడు అనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్ అప్పుడు మనవడితో ఆడుకుంటూ సరదాగా, సాత్వికంగా కనపడే ఒక షేడ్ లో కనపడితే, రెండో షేడ్ లో రివెంజ్ తీసుకునే పాత్ర, క్లైమాక్స్ లో భావోద్వేగమైన పాత్ర, ఇలా ఇన్నిరకాలుగా చాలా బాగా చేసాడు. అలాగే తనదయిన స్టైల్, మార్కును కూడా ఎక్కడా వదలకుండా మధ్య మధ్యలో అవికూడా చూపించాడు. చెప్పాలంటే పూర్తిగా ఇది రజిని సినిమా అనే చెప్పాలి. సినిమాలో ఇంకో పెద్ద పాత్ర విలన్ గా చేసిన వినాయకన్ (Vinayakan) ది. అతను కొత్తగా వున్నాడు సినిమాలో, తన విలనిజంతో అదరగొట్టాడు. మోహన్ లాల్ (MohanLal), శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ ఉండటం వలన సినిమా ఇంకో స్థాయికి వెళ్ళింది అని చెప్పాలి. వసంత్ రవి (VasanthRavi) పోలీస్ ఆఫీసర్ గా, రజినీకాంత్ కొడుకుగా బాగానే కుదిరాడు. సునీల్ (Sunil), తమన్నా (TamannahBhatia) పాత్రల మధ్య హాస్య సన్నివేశాలు బాగున్నాయి. అలాగే రమ్యకృష్ణ (Ramyakrishna) పాత్రకి తగ్గట్టుగా చేసింది. యోగిబాబు (Yogibabu), విటి గణేశన్ (VTGaneshan) బాగా నవ్వించారు.

jailerreview1.jpg


ఈ సినిమాకి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అది అనిరుద్ రవిచందర్ (AnirudhRavichander) సంగీతం అని చెప్పాలి. అతని నేపధ్య సంగీతం సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది. అసలు ప్రతి సన్నివేశాన్ని అతను తన తన సంగీతంతో ఎలివేట్ చేసాడు. నిజంగా సినిమాకి ఒక ఆయువుపట్టులా అనిరుధ్ సంగీతం నిలిచింది. కన్నం ఛాయాగ్రహణం కూడా చక్కగా కుదిరింది. సాంకేతికంగా అన్నీ సినిమాకి బాగా అమరాయి. పోరాట సన్నివేశాలన్నీ కూడా సినిమాకి హైలైట్, అలాగే ఆ సన్నివేశాల్లో వచ్చిన నేపధ్య సంగీతం వాటికీ మరికొంత బాగా రావటానికి ఉపకరించింది. మాటలు కూడా బాగున్నాయి. తమన్నా పాట విడుదలై సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే, అదే పాటని సినిమాలో కూడా బాగా కోరియోగ్రఫీ చేసి చూపించాడు జానీ మాస్టర్.

jailerreview2.jpg

చివరగా, రజినీకాంత్ 'జైలర్' సినిమా అతని అభిమానులను మెప్పిస్తుంది అనటంలో ఎట్టి సందేహం లేదు. #JailerFilmReview దర్శకుడు నెల్సన్ (Nelson) అందరికీ తెలిసిన, ఇంతకు ముందు వచ్చిన కథ అయినా, ఆసక్తికరంగా మలచడంలో, ఒక పెద్ద స్టార్ ఇమేజ్ వున్న రజినీకాంత్ ని ఎలా చూపిస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారో, అలా చూపించాడు. 2010 'రోబో' #Robo తరువాత రజినీకాంత్ కు ఈ 'జైలర్' #JailerReview సినిమా ఒక పెద్ద హిట్ సినిమా అవబోతోంది అని చెప్పొచ్చు. వయసు పెరిగినా, క్రేజ్ తగ్గని తలైవాకి హిట్ సినిమా అంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కోతలే! అర్థమైందా రాజా !

Updated Date - 2023-08-10T15:24:43+05:30 IST