Thalaiva 170 : కేరళలో షూటింగ్‌ షురూ.. అభిమానులకు అభివాదం!

ABN , First Publish Date - 2023-10-06T17:05:54+05:30 IST

సూపర్‌స్టార్‌ రజినీకాంత్ (Rajanikanth) స్టైల్‌, ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం రజనీకాంత్‌ తన 170వ (Thalaiva 170) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కేరళలోని తిరువనంతపురంలో తాజాగా ప్రారంభమైంది.

Thalaiva 170 : కేరళలో షూటింగ్‌ షురూ.. అభిమానులకు అభివాదం!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్ (Rajanikanth) స్టైల్‌, ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం రజనీకాంత్‌ తన 170వ (Thalaiva 170) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కేరళలోని తిరువనంతపురంలో తాజాగా ప్రారంభమైంది. ఆ చిత్రీకరణలో రజనీకాంత్‌ పాల్గొంటున్నారని తెలిసిన అభిమానులు వందల సంఖ్యలో షూటింగ్‌ స్పాట్‌కు చేరుకున్నారు. వారిని చూసిన తలైవా అభివాదం చేశారు. ఫ్యాన్స ‘తలైవా’ అంటూ కేకలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం రజనీకింత మేకోవర్‌ అదిరింది. కొత్త లుక్‌లో కనిపించారు. ఆ లుక్‌ చూసిన నెటిజన్లు 70 ఏళ్ల వయసులోనూ తలైవా యంగ్‌ హీరోలతో పోటీపడుతున్నారు అంటు కామెంట్లు చేస్తున్నారు. టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సోషల్‌ మెసేజ్‌తో కూడిన కథతో ఈ చిత్రం రూపొందుతుంది.

‘తలైవా 170’ చిత్రం భారీ తారాగణంతో రూపొందనుంది. అన్ని భాషలకు చెందిన అగ్ర నటులు ఈ చిత్రంలో నటీస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, మలయాళం నుంచి ఫహాద్‌ ఫాజిల్‌, టాలీవుడ్‌ నుంచి రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ నాయికలుగా నటిస్తున్నారు.

Updated Date - 2023-10-06T17:05:54+05:30 IST