MLC Kavitha: మెగాస్టార్ చిరంజీవి తర్వాత కవితకు ఏ హీరో ఇష్టమంటే..

ABN , First Publish Date - 2023-10-28T22:30:07+05:30 IST

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని మెయిన్ పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలలో మునిగితేలుతున్నాయి. ఈ ప్రచారానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను టచ్ చేస్తూ.. జనాల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో కాసేపు నెటిజన్లతో ముచ్చటించారు. చిరు, బన్నీలకు తను అభిమానిని అని చెప్పుకొచ్చారు.

MLC Kavitha: మెగాస్టార్ చిరంజీవి తర్వాత కవితకు ఏ హీరో ఇష్టమంటే..
Kalvakuntla Kavitha and Chiranjeevi

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని మెయిన్ పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలలో మునిగితేలుతున్నాయి. ఈ ప్రచారానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను టచ్ చేస్తూ.. జనాల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో కాసేపు నెటిజన్లతో ముచ్చటించారు. ఎక్స్ వేదికగా ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ ద్వారా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్సీ కవిత సమాధానం చెబుతూ వచ్చారు. అయితే ఈ చాట్ కార్యక్రమంలో పాలిటిక్స్‌తో పాటు సినిమాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఆమె స్పందించారు. ముఖ్యంగా ఇద్దరు నెటిజన్లు సినిమాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అందులో ఒక ప్రశ్న అందరికీ తెలిసిందే. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవికి కల్వకుంట్ల కవిత అభిమాని అనే విషయం. నేను మెగాస్టార్ చిరంజీవిగారికి వీరాభిమానిని. ఆయన సినిమాలు అప్పట్లో అన్నీ చూసేదానిని అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పబ్లిగ్గా కవిత చెప్పుకొచ్చారు. తాజాగా మెగాస్టార్‌తో కవిత సెల్ఫీ తీసుకుంటున్న పిక్‌ని పోస్ట్ చేసిన ఓ నెటిజన్.. మీరు కూడా చిరంజీవిగారి అభిమాని అని తెలుసు.. ఆయన గురించి ఏమైనా చెప్పండి అని అడుగగా.. ‘డై హార్డ్ ఫ్యాన్’ (Die Hard Fan) అంటూ కవిత సమాధానమిచ్చారు. ఆమె ఇచ్చిన ఈ సమాధానాన్ని.. మెగా ఫ్యాన్స్ లైక్స్, రీ ట్వీట్స్‌తో వైరల్ చేస్తున్నారు.


అనంతరం మరో నెటిజన్ ‘మీ అభిమాన హీరో ఎవరు మేడమ్?’ అని ప్రశ్నించగా.. ‘‘ఎప్పటికీ చిరంజీవే.. నెక్స్ట్ అల్లు అర్జున్- తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ ఆ సినిమాలో చేసే మేనరిజమ్‌ని పోస్ట్ చేశారు. దీనికి మెగా ఫ్యాన్స్.. ‘మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. అల్లు అర్జున్ (Allu Arjun).. తగ్గేదేలే’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదంతా ఎలక్షన్ స్టంట్ అంటూ అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఏదిఏమైనా.. మెగా ఫ్యాన్స్‌లో మాత్రం కవిత జోష్ నింపారన్నది మాత్రం.. ఆ లైక్స్‌, రీ ట్వీట్స్, కామెంట్స్ చూస్తుంటే తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

========================

*Satyam Rajesh: సత్యం రాజేష్ టైమ్ నడుస్తోంది

***********************************

*Rekha: ఊపిరి ఉన్నంత వరకు.. నా కోరిక అదే..

*********************************

Updated Date - 2023-10-29T03:24:22+05:30 IST