సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rajanikanth: నా భార్య వల్లే నాలో మార్పు వచ్చింది!

ABN, First Publish Date - 2023-01-27T16:50:50+05:30

తలైవా రజనీకాంత్‌ నటననే కాదు.. వ్యక్తిత్వంలోనూ ఆయన్ను చాలామంది స్ఫూర్తిగా తీసుకుంటారు. అయితే రాజనీ మాత్రం తన భార్య తనను ఎంతో మార్చిందని చెబుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలైవా రజనీకాంత్‌ (Rajanikanth) నటననే కాదు.. వ్యక్తిత్వంలోనూ ఆయన్ను చాలామంది స్ఫూర్తిగా తీసుకుంటారు. అయితే రాజనీ మాత్రం తన భార్య తనను ఎంతో మార్చిందని చెబుతుంటారు. ఆమెకు ఎంతో రుణపడి ఉంటానని కృతజ్ఞతలు చెబుతారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆయన భార్య గురించి గొప్పగా ఎన్నో వేదికలపై చెప్పారు. మరోసారి రజనీ భార్య లతకు (latha rajanikanth)కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన వేదికపై మాట్లాడుతూ తన భార్య వల్లే క్రమశిక్షణ నేర్చుకున్నానని పేర్కొన్నారు.

Rajanikanth praises his wife)

‘‘నా భార్యను లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్‌కు నేను రుణపడి ఉంటాను. బస్సు కండక్టర్‌గా పని చేస్తున్నప్పుడు రోజూ మద్యం తాగేవాడిని. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగేవాడినో లెక్కే ఉండేది కాదు. అలాగే మాంసాహారమూ తినేవాడిని. ఈ మూడు అలవాట్లకు బానిసలైన వాళ్లు కొంతకాలం తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరన్నది నా అబి?ప్రాయం. నా భార్య లత తన ప్రేమతో నన్ను ఎంతో మార్చింది. ఆమె వల్లే ఇప్పుడు నేను క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను’’ అని అన్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో ‘‘జైలర్‌’ సినిమాలో నటిస్తున్నారు.

Updated Date - 2023-01-27T16:50:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!