Chandramukhi 2: కంగన, కాజల్ కన్నా ముందు ఇంకో నటిని అనుకున్నారు, ఆమె అయితే ఆ సినిమా ఇంకో రేంజ్ లో ఉండేది...

ABN , First Publish Date - 2023-08-29T10:04:42+05:30 IST

దర్శకుడు పి వాసు, రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో వస్తున్న 'చంద్రముఖి 2' కి అనుకున్నంత బజ్ రావటం లేదు అంటున్నారు. చంద్రముఖి పాత్ర కోసం, కంగనా కన్నా ముందు కాజల్ ని అనుకున్నారు, కానీ వీళ్లిద్దరి కన్నా ముందు ఇంకో అద్భుత నటి చెయ్యాల్సి వుంది, కానీ చెయ్యలేదు., ఎవరామె, ఎందుకు చెయ్యలేదు....

Chandramukhi 2: కంగన, కాజల్ కన్నా ముందు ఇంకో నటిని అనుకున్నారు, ఆమె అయితే ఆ సినిమా ఇంకో రేంజ్ లో ఉండేది...
Kangana Ranaut and Kajal Aggarwal

సీనియర్ దర్శకుడు పి వాసు (PVasu), రాఘవ లారెన్స్ (RaghavaLawrence) కథానాయకుడిగా 'చంద్రముఖి 2' #Chandramukhi2 విడుదలకి సిద్ధం అవుతోంది. ఇది అప్పుడెప్పుడో వచ్చిన 'చంద్రముఖి' #Chandramukhi సినిమాకి సీక్వెల్ గా వస్తోంది అని అంటున్నారు. ఇందులో చంద్రముఖి గా కంగనా రనౌత్ (KanganaRanaut) నటిస్తోంది. ఆమె కన్నా ముందు దర్శకుడు కాజల్ అగర్వాల్ (KajalAggarwal) ని అనుకున్నారు, ఆమె కూడా చెయ్యడానికి ఒప్పుకుంది, కానీ ఆమె తేదీలు సరిగ్గా ఈ సినిమాకి కుదరక పోవటంతో ఆమె తప్పుకుంది. ఆమె స్థానంలో కంగనా రనౌత్ వచ్చింది.

jyothika3.jpg

ఈ సినిమా చాలా భాగం హైద్రాబాదులోని రామోజీ ఫిలిం స్టూడియోలోనే (RamojiFilmCity) చిత్రీకరించారు. అయితే కాజల్, కంగనా కన్నా ముందు ఈ సినిమాలో చంద్రముఖి పాత్ర కోసం ఇంకో నటిని సంప్రదించారు అని తెలిసింది. ఆమె మరెవరో కాదు సాయి పల్లవి (SaiPallavi). వున్న నటీమణుల్లో సాయి పల్లవి ఎటువంటి నటి అన్నది అందరికీ తెలిసిన విషయమే.

సాయి పల్లవి దగ్గరికి వెళ్లి ముందు ఈ 'చంద్రముఖి 2' కథ గురించి చెప్పారు అని తెలిసింది. ఆమెకి కూడా ఈ పాత్ర చాలా బాగా నచ్చింది, చేస్తాను అని కూడా చెప్పింది. అయితే ఆమె పతాక సన్నివేశాల్లో చాలా చిన్న మార్పు ఎదో అడిగింది అని తెలిసింది. అయితే దర్శకుడు ఆమెకి చెప్పి ఒప్పించవచ్చు కానీ, ఎందుకో మరి అది జరగలేదు. సాయి పల్లవి కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు అని తెలిసింది. అలా ఈ సినిమా ఆమె చెయ్యాల్సింది, ఎందుకో వేరే వాళ్ళకి వెళ్ళింది అని తెలిసింది. 'చంద్రముఖి' మొదటి పార్టులో జ్యోతిక (Jyothika) చాలా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించింది.

saipallavi3.jpg

ఒకవేళ సాయి పల్లవి కనక చేసి ఉంటే, ఈ సినిమా ఇంకో రేంజ్ లో ఉండేది అని తమిళ చిత్ర పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ఎందుకంటే కంగనా రనౌత్ ఈ సినిమా కథ విని చెయ్యలేదు, దర్శకుడు పి వాసు వేరే కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆమె ఈ సినిమా గురించి విని తనే చేస్తాను అని ముందుకు వచ్చింది అని దర్శకుడే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు కదా. అందుకే ఈ సినిమాకి ఇప్పుడు అంత బజ్ లేకపోవటానికి కారణం అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-08-29T10:04:42+05:30 IST