Rajanikanth: కోలీవుడ్‌లో ఈ మార్క్‌ చేసుకున్న తొలి భారతీయ సినిమా!

ABN , First Publish Date - 2023-09-09T14:47:15+05:30 IST

‘జైలర్‌’తో రజనీకాంత్‌ రికార్డులు సృష్టిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం గత రికార్డులును దాటుకుని సరికొత్త రికార్డులు సృష్టింస్తోంది. తాజాగా ఈ చిత్రం తమిళనాట ఓ ఘనత సాధించింది. దీంతో సొంత గడ్డపై తనకు తిరుగులేదని నిరూపించారు రజనీకాంత్‌.

Rajanikanth: కోలీవుడ్‌లో ఈ మార్క్‌ చేసుకున్న తొలి భారతీయ సినిమా!

‘జైలర్‌’(jailer)తో రజనీకాంత్‌ (Rajanikanth) రికార్డులు సృష్టిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం గత రికార్డులును దాటుకుని సరికొత్త రికార్డులు సృష్టింస్తోంది. తాజాగా ఈ చిత్రం తమిళనాట ఓ ఘనత సాధించింది. దీంతో సొంత గడ్డపై తనకు తిరుగులేదని నిరూపించారు రజనీకాంత్‌. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో కళానిధి మారన్‌ నిర్మించిన ‘జైలర్‌’ చిత్రం ఆగస్టు 10న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.630 కోట్ల(గ్రాస్‌)కు పైగా వసూళ్లు చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఒక్క తమిళనాడులోనే బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.100కోట్ల షేర్‌ రాబట్టి చరిత్ర సృష్టించింది. దీంతో కోలీవుడ్‌లో ఈ మార్క్‌ను చేరుకున్న తొలి ఇండియన్‌ సినిమాగా నిలిచింది జైలర్‌. తమిళనాట 900 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ కొన్నిచోట్ల థియేటర్స్‌లో ఆడుతోంది. ఇటీవల ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. అక్కడ కూడా అత్యధిక వ్యూవ్స్‌ మినిట్స్‌ సాధించిన చిత్రంగా ట్రెండ్‌ సృష్టిస్తోంది. అంతే కాదు ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా వస్తుందని ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్‌. ప్రస్తుతం రజనీకాంత్‌ చేతిలో ఉన్న సినిమాలే ఒక కొలిక్కి వచ్చాక ‘జైలర్‌’ సీక్వెల్‌ పనులని మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు అధిక లాభాలు రావడంతో నిర్మాత కళానిధి మారన్‌, హీరో రజనీకి, దర్శకుడికి బహుమతిగా ఓ చెక్కు, కోటిన్నర విలువల గల బీఎమ్‌డబ్య్లు ఎక్స్‌7 కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతే కాదు లాభాల్లో కొంతభాగాన్ని సమాజ ేసవకు వినియోగిస్తున్నారు. పేద పిల్లల గుండె ఆపరేషన్లకు కొంత అందజేశారు.

Updated Date - 2023-09-09T14:47:15+05:30 IST