Ester Noronha: ఎస్తర్ మొదటిసారిగా దర్శకత్వం చేసిన 'ది వేకెంట్ హౌస్' తెలుగులో కూడా విడుదల

ABN , First Publish Date - 2023-09-14T12:42:24+05:30 IST

నటి ఎస్తర్ దక్షిణాది భాషల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే ఒక కన్నడ, కొంకణి సినిమా 'ది వేకంట్ హౌస్' కి దర్శకత్వం వహించడంతో పాటు, ఆ సినిమాకి చాలా విభాగాల్లో పనిచేసింది. ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తోంది.

Ester Noronha: ఎస్తర్ మొదటిసారిగా దర్శకత్వం చేసిన 'ది వేకెంట్ హౌస్' తెలుగులో కూడా విడుదల
Ester Noronha

దక్షిణాదిలో అన్ని భాషల్లో బిజీ గా వున్న నటీమణుల్లో ఎస్తర్ (EsterNoronha) ఒకరు. ఆమె నటనతో పాటు, దర్శకత్వంలో కూడా తన ప్రతిభ పాటవాలను చూపిస్తూ 'ది వేకెంట్ హౌస్' #TheVacantHouse అనే సినిమాకి దర్శకత్వం వహించింది. ఈ సినిమా ఇప్పుడు విడుదలకి సిద్ధం అవుతోంది. ఎస్తర్ కన్నడ నటి, అందుకని ఈ సినిమాని ముందుగా కన్నడ, కొంకిణి భాషల్లో విడుదల చెయ్యాలనుకున్నా, ఈ సినిమా కథాంశం అందరికీ నచ్చుతుందని, మిగతా భాషల్లో అంటే తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చెయ్యడానికి సంకల్పించింది ఎస్తర్.

Ester Noronha (10).jpg

ఈ సినిమాలో నటించటంతో పాటు దర్శకత్వం కూడా చేసిన ఎస్తర్, తన మల్టీ ట్యాలెంటె చూపించింది, ఈ సినిమాకి సంగీతం, నేపధ్యగాయనిగా కూడా పని చెయ్యడమే కాకుండా, రచన కూడా ఎస్తర్ చేసింది. ఈ సినిమాకి నిర్మాత ఎస్తర్ తల్లి జానెట్ నోరోన్హా. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించింది. ఈ కథా నేపధ్యం అంతా ఒక గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతూ ఉంటుందని తెలిసింది. ఈ సినిమా తన కలల ప్రాజెక్ట్ అని అందుకే ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు, సాహిత్యం, పాటలు, నేపథ్య సంగీతంతో పాటు దర్శకత్వం కూడా చేసాను అని చెప్పింది.

రేపు విడుదల కానున్న 'చాంగురే బంగారురాజా' (ChangureBangaruRaja) సినిమాలో కూడా ఎస్తర్ ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఆమె అల్లరి రవిబాబు (AllariRaviBabu)తో వున్న సన్నివేశాలు చాలా బాగుంటాయని, ఈ సినిమా నిర్మాత రవితేజ (RaviTeja)ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

Updated Date - 2023-09-14T12:42:24+05:30 IST