Jailer in OTT : రజనీ హవా ఇప్పుడు ఓటీటీలో...

ABN , First Publish Date - 2023-09-02T12:12:12+05:30 IST

రజనీకాంత్‌ (rajanikanth) కథానాయకుడిగా నటించిన ‘జైలర్‌’ (jailer)చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! అందులో ‘నువ్వు కావాలయ్యా’ అంటూ తమన్నా చేసిన సందడి, వేసిన స్టెప్పులు సినిమా విడుదలకు ముందు సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేసింది. సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించి రజనీ అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా చేసింది.

Jailer in OTT : రజనీ హవా ఇప్పుడు ఓటీటీలో...

రజనీకాంత్‌ (rajanikanth) కథానాయకుడిగా నటించిన ‘జైలర్‌’ (jailer)చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! అందులో ‘నువ్వు కావాలయ్యా’ అంటూ తమన్నా చేసిన సందడి, వేసిన స్టెప్పులు సినిమా విడుదలకు ముందు సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేసింది. సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించి రజనీ అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా చేసింది. అంతేకాదు ఓవరాల్‌గా ఈ చిత్రం రూ. 650 కోట్లు వసూళ్లు రాబట్టిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్ట్‌ 10న విడుదలై ఇప్పటికీ థియేటర్స్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ర్టీమింగ్‌ కానుంది. ఓటీటీ విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అమెజాన్‌ ఓటీటీ (Amazon Prime) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ర్టీమింగ్‌ కానుందని అధికారికంగా ప్రకటించింది. తొలుల ఈ చిత్రం సన్‌నెక్ట్స్‌లో స్ర్టీమింగ్‌ అవుతుందని భావించారు. అయితే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జైలర్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ర్టీమింగ్‌ కానున్నట్లు ప్రకటించి రూమర్‌లక్‌ చెక్‌ పెట్టారు. రజనీకాంత్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మీర్నా మీనన్‌, జయం రవి కీలక పాత్రల్లో నటించారు. శివరాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, మోహన్‌లాల్‌ ముఖ్య పాత్రల్లో మెరిసి సినిమా సక్సెస్‌లో భాగమయ్యారు. (jailer in OTT)

ఈ చిత్రం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న నిర్మాత కళానిధి మారన్‌ గురువారం హీరో రజనీకాంత్‌ను కలిసి చెక్‌ అందించారు. అలాగే ఆయనకు బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌7 కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అలాగే దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కు కూడా ఆయన బీఎమ్‌డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారు.

Updated Date - 2023-09-02T12:12:35+05:30 IST