Kollywood Issues: కొత్త నిబంధనలతో కోలీవుడ్‌లో వ్యతిరేకత!

ABN , First Publish Date - 2023-07-22T19:23:08+05:30 IST

తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులోనే చిత్రీకరణలు జరపాలని, కథకు అవసరం, అత్యవసరమైతేనే షూట్‌ కోసం బయట ప్రాంతాలకు వెళ్లాలని, అలాగే, కేవలం తమిళ నటీనటులను మాత్రమే సినిమాల్లోకి తీసుకోవాలంటూ ప్రవేశపెట్టిన కొత్త నియమాలు కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

Kollywood Issues: కొత్త నిబంధనలతో కోలీవుడ్‌లో వ్యతిరేకత!

తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (FEFSI- ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులోనే చిత్రీకరణలు జరపాలని, కథకు అవసరం, అత్యవసరమైతేనే షూట్‌ కోసం బయట ప్రాంతాలకు వెళ్లాలని, అలాగే, కేవలం తమిళ నటీనటులను మాత్రమే సినిమాల్లోకి తీసుకోవాలంటూ ప్రవేశపెట్టిన కొత్త నియమాలు కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి. చిత్రీకరణలపై ఆంక్షలు విధించడాన్ని అదే ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు (Tamil Producers) వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులోని పరిసరాలు షూటింగ్స్‌కు అనుకూలంగా లేవని, కనీస సదుపాయాలు లేవని, అనుమతుల్లో జాప్యంతోనే రాష్ట్రంలో షూటింగ్‌ చేయలేకపోతున్నామని నిర్మాతలు తెలిపారు. పేరు పొందిన సూడియో స్థలాల్లో కమర్షియల్‌ కాంప్లెక్సుల నిర్మాణం జరగడంతో సెట్స్‌ వేయడానికి కుదరక తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాలకు షూటింగ్‌ కోసం వెళ్తున్నామని తెలిపారు. దీంతో తమిళ నిర్మాత మధ్య సఖ్యత లేదనే విమర్శలొస్తున్నాయి. (FEFSI)

తమిళ చిత్ర పరిశ్రమలోని 23 విభాగాలకు చెందిన దాదాపు 20 వేల మంది సభ్యులతో ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ కొనసాగుతోంది. తమిళ నటీనటుల సంక్షేమం, స్థ్థానికంగా షూటింగ్స్‌ చేసి తమిళ చిత్ర పరిశ్రమ ఉనికిని కాపాడాలన్న ఉద్దేశంతో కొత్త నియమాలను ప్రవేశపెట్టినట్లు తాజా ప్రకటనలో ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ తెలిపిన సంగతి విధితమే!

Updated Date - 2023-07-22T19:29:54+05:30 IST