Telugu web series streaming on OTT: ఈవారం థియేటర్ లో, ఓటిటిలో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్, సినిమాలు ఇవే

ABN , First Publish Date - 2023-07-14T15:35:00+05:30 IST

కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్ లు ఏమి విడుదల అయ్యాయి, ఏ ఓటిటి ఛానల్ లో ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా.

Telugu web series streaming on OTT: ఈవారం థియేటర్ లో, ఓటిటిలో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్, సినిమాలు ఇవే
Nenu Student is streaming on Aha

శుక్రవారం అనగానే థియేటర్స్ లో సినిమాలు, అలాగే ఓటిటి లో కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా విడుదల అవుతున్నాయి. ఈ వారం విడుదల అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏయే ఓటిటి లో ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.

baby1.jpg

ఈరోజు 'బేబీ' #BabyTheMovie సినిమా విడుదల అయింది. సాయి రాజేష్ (SaiRajesh) దర్శకత్వంలో, ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda), విరాజ్ అశ్విన్ (VirajAswin), వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya) నటించిన ఈ సినిమా ప్రచార చిత్రాలు బాగా ఆకట్టుకోవటమే కాకుండా, ఈ సినిమాకి గీత ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ అండగా ఉండటంతో, ఎక్కువ థియేటర్స్ లో విడుదల అయింది. అలాగే ఉదయనిధి స్థాలిన్, కీర్తి సురేష్, వడివేలు, ఫహాద్ ఫాజిల్ నటించిన 'మామన్నన్' Maamannan అనే తమిళ సినిమా తెలుగులో 'నాయకుడిగా' #Nayakudu విడుదల అయింది. ఇక శివ కార్తికేయన్, అదితి శంకర్ నటించిన 'మహావీరుడు' #Mahaveerudu కూడా ఈరోజు విడుదల అయింది. అయితే ఈ సినిమా మార్నింగ్ షోస్ కొన్ని దగ్గర్ల కాన్సుల్ అయినట్టుగా తెలిసింది. కంటెంట్ రాలేదు అని చెప్పారు.

ఇక వెబ్ సిరీస్ ఏవేవి ఎక్కడ విడుదల అయ్యాయో చూద్దాం.

మాయాబజార్ ఫర్ సేల్ -- జీ5 (Zee5)

తెలుగు వెబ్ సిరీస్ 'మాయాబజార్ ఫర్ సేల్ ' #MayabazarForSale జీ5 Zee5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లో వుండే ధనవంతుల కుటుంబాలకి సంబందించిన కథ. ప్రభుత్వం ఈ కమ్యూనిటీలో కట్టే ఇళ్ళు అన్నీ చట్టవిరుద్ధం అంటూ కూల్చడానికి వస్తారు. ఆ సమయంలో ఈ కుటుంబాలు అన్నీ ఏమి చేశాయి, ఎలా దీన్ని ఎదుర్కొన్నారు అనేది ఈ కథ. ఇందులో నవదీప్ (Navdeep), ఈషా రెబ్బ (EeshaRebba), సీనియర్ నరేష్ (VKNaresh), ఝాన్సీ (Jhansi), హరితేజ, రవివర్మ ఇంకా చాలామంది నటీనటులు వున్నారు. దీనికి దర్శకుడు గౌతమ్ చల్లగుల్ల, అలాగే అతను నిర్మాతల్లో ఒకరుగా కూడా వున్నారు.

nenustudentsir.jpg

నేను స్టూడెంట్ సర్ --- ఆహా (Aha)

బెల్లంకొండ గణేష్ (BellamkondaGanesh), అవంతిక దస్సాని (AvantikaDassani) జంటగా నటించిన సినిమా 'నేను స్టూడెంట్ సర్' #NenuStudentSir. ఇది థియేటర్ లో విడుదల అయి బాగుంది అన్నారు కానీ, వ్యాపారాత్మకంగా అంతగా వర్క్ అవుట్ కాలేదు. రాఖీ ఉప్పలపాటి (Rakhi Uppalapati) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఆహా #Aha ఛానల్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సముద్రఖని (Samuthirakani), సునీల్ (Sunil), శ్రీకాంత్ ఐయ్యంగార్ లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. సుబ్బు (బెల్లంకొండ గణేష్) ఒక ఐ ఫోన్ కొనాలని అనుకుంటాడు, కానీ ఆర్ధికంగా అతను అంత స్తోమత లేనివాడు. అయితే ఎదో కష్టనష్టాలు పడి ఒక ఐ ఫోన్ 12 తీసుకుంటాడు, కానీ అదే అతనికి కష్ఠాలు తెచ్చిపెడుతుంది. ఆ ఫోను వలన సుబ్బు చేయని హత్యలో భాగం అవుతాడు, అలాగే అతని అకౌంట్ కి కోటి రూపాయలకి పైగా డబ్బులు జమ చేరుతాయి. ఇవన్నీ ఎలా అతనికి వచ్చాయి, అతను ఎలా అవి తనవి కావని ప్రూవ్ చేసుకున్నాడు అన్నదే కథ.

hosteldays.jpg

హాస్టల్ డేస్ -- ప్రైమ్ వీడియో (AmazonPrimeVideo)

కాలేజీ విద్యార్థులు, కాలేజీ లైఫ్ ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు ఆదిత్య మండల (AdityaMandala) ఈ కాలేజీ లైఫ్ నేపథ్యంలో అయిదు ఎపిసోడ్స్ గా 'హాస్టల్ డేస్' #HostelDays అనే వెబ్ సిరీస్ చేసాడు. ఇది ప్రైమ్ వీడియో (AmazonPrimeVideo) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో దరహాస్ మాటూరు, అనన్య ఆకుల, మౌళి తనూజ్, అక్షయ్ లగుసాని, ఐశ్వర్య మరియు జైత్రి మకానా తదితరులు నటించారు.

ఈ కథ క్లుప్తంగా చెప్పాలంటే ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల హాస్టల్ లైఫ్ అనుభవంతో ఈ వెబ్ సిరీస్ కథ నేపధ్యం అనే చెప్పాలి. కొత్తగా ఒక కాలేజీలో సీట్ వచ్చి, హాస్టల్ కి వచ్చిన కావ్య, రితిక, మోనిక, సాయి రామ్, చిత్తరంజన్, నవీన్ యాదవ్ అనే స్టూడెంట్, వాళ్ళ జీవితాలు, వాళ్ళ అనుభవాలు, వీళ్ళు ఎలా పక్కదారి పట్టారు, కొన్ని సంగతనాలు వీరి జీవితాల మీద ఎలా ముద్ర పడ్డాయి లాంటివి అన్నీ ఇందులో చూపించారు. మొబైల్ ఫోన్స్ ఎటువంటి ప్రభావం చూపించాయి అనే పాయింట్ కూడా ఉంటుంది. ఇందులోనే ప్రేమ ఉంటుంది, అలాగే దాని నుంచి డైవర్షన్ కూడా చూపించారు.

తందట్టి (Thandatti) -- ప్రైమ్ వీడియో (AmazonPrimeVideo)

రామ్ సంగయ్య దర్శకత్వం వహించిన ఈ తమిళ సినిమాలో రోహిణి, అమ్ము అభిరామి, పసుపర్తి, వివేక్ ప్రసన్న ఇతర నటీనటులు వున్నారు. ఒక కానిస్టేబుల్ చనిపోయిన ఒక ముసలామె బంగారు చెవి రింగులు పోయాయి అనటంతో, ఆ కేసును తీసుకుంటాడు. ఇంతకీ అతను ఆ బంగారు రింగులు పట్టుకున్నాడో, ఏమయ్యాయి, ఈ వెతుకులాటలో అతని ఎదురయ్యే సంఘటనలు ఏంటి అనేది కొంచెం కామెడీగా చెప్పాడు.

thetrial.jpg

ది ట్రయల్ -- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar)

ఇవే కాకుండా, అజయ్ దేవగన్ (AjayDevgn) భార్య, బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) ఓటిటి లో ఆరంగేట్రం చేసిన 'ది ట్రయల్' #TheTrial అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) లో స్ట్రీమింగ్ అవుతోంది. తన భర్త ని జైలు లో వేసి అతని మీద అనేక ఆరోపణలు చేస్తే, తన కుటుంబానికి కాపాడుకోవటానికి ఆ ఇంటి ఇల్లాలు ఏమి చేసింది అనేదే ఈ వెబ్ సిరీస్. ఇందులో కాజోల్ భార్య పాత్ర వేసింది. ఇది ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'ది గుడ్ వైఫ్' #TheGoodWife ఆధారంగా తీసిన వెబ్ సిరీస్.

ఇవే కాకుండా, 'కాలేజీ రొమాన్స్' #CollegeRomance అనే వెబ్ సిరీస్ సోనీ లివ్ (SonyLiv) లో, 'జానకి జాన్' (JanakiJaane) అనే మలయాళం సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Updated Date - 2023-07-14T15:36:26+05:30 IST