Rana Naidu Trailer: రానా వర్సెస్ వెంకటేష్.. ఎవ్వరూ తగ్గలే!

ABN , First Publish Date - 2023-02-15T21:42:28+05:30 IST

రానా నాయుడు (Rana Naidu)కి సెలబ్రిటీలు, వివాదాలు, గాయాలు పెద్ద విషయం కాదు - కానీ అతని తండ్రి? అది వేరే కథ. నెట్‌ఫ్లిక్స్ (NetflixIndia) నుంచి రాబోయే

Rana Naidu Trailer: రానా వర్సెస్ వెంకటేష్.. ఎవ్వరూ తగ్గలే!
Venkatesh and Rana Daggubati in Rana Naidu

రానా నాయుడు (Rana Naidu)కి సెలబ్రిటీలు, వివాదాలు, గాయాలు పెద్ద విషయం కాదు - కానీ అతని తండ్రి? అది వేరే కథ. నెట్‌ఫ్లిక్స్ (NetflixIndia) నుంచి రాబోయే హై-ఆక్టేన్, యాక్షన్-ప్యాక్డ్ రైడ్‌ సిరీస్ ‘రానా నాయుడు’. రానా దగ్గుబాటి (Rana Daggubati), వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati) మొదటిసారిగా తండ్రీకొడుకులుగా నటించిన ఈ సిరీస్.. ప్రసిద్ధ అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కు ఎడాప్ట్టేషన్. 10 మార్చి, 2023న ప్రీమియర్ కానుంది. దీనిని సుందర్ ఆరోన్ లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించారు. ఇండియా కోసం కరణ్ అన్షుమాన్ రూపొందించారు. ఈ సిరీస్‌కి కరణ్ అన్షుమాన్ & సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. వెంకటేష్, రానా, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థితో పాటు కరణ్ అన్షుమాన్, సుపర్ వర్మ, సుందర్ ఆరోన్, మోనికా షెర్గిల్, విపి కంటెంట్, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా పాల్గొన్నారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. రానా ఒక అల్టిమేట్ సెలబ్రిటీ ఫిక్సర్ అయినప్పటికీ.. అతనికి తండ్రి నాగతో పెద్ద సమస్య ఉన్నట్లుగా అర్థమవుతోంది. విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి ఇంటెన్స్ పాత్రలో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసాధారణ శక్తితో మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ని అందిస్తూ మరింత ఆసక్తిని పెంచారు. ఆయన పాత్ర చిత్రీకరణ వైవిధ్యంగా ఉంది. వెంకటేష్ పోషించిన నాగ పాత్ర హైదరాబాదీ తేజ్ దమ్ కా చాయ్ లాగా ఉంది - ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీ, నో టెన్షన్!. అలాగే రానా కూడా ఎక్కడా తగ్గలేదు. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వారి నటనను ప్రదర్శించారు. ఓవరాల్‌గా పవర్ ఫుల్ కంటెంట్‌తో ఈ సిరీస్ డిజైన్ అయినట్లుగా అయితే ట్రైలర్ చెప్పేస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Rana Naidu Web Series Trailer)

Rana-2.jpg

ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో రానా (Rana) మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్ట్ చాలా కారణాల వల్ల నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఇది నెట్‌ఫ్లిక్స్‌తో బాబాయ్ వెంకీతో నా మొదటి కొలాబరేషన్. ఈ ప్రాజెక్ట్‌లో సుందర్ (ఆరోన్,) కరణ్ (అన్షుమాన్) సుపర్ణ్ (వర్మ)తో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. రానా నాయుడు దానిని అందించినందుకు సంతోషిస్తున్నాను. మొత్తం తారాగణం, టీం ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. రానా నాయుడు పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించింది. రానా, నాగ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రపంచాన్ని అందరూ ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను’’ అని తెలిపారు.

rana-Naidu.jpg

వెంకటేష్ మాట్లాడుతూ .. ‘రానా నాయుడు’ వంటి ఎగ్జైటింగ్ షో కోసం మొదటిసారిగా మా అన్నయ్య గారి అబ్బాయితో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా అనిపించింది. నాగ పాత్రను పోషించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. నేను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదు. నాగ ఒక రిఫ్రెష్ చేంజ్. ఈ పాత్ర తెలివైన, ఆకర్షణీయమైన లేయర్లుగా వుంటుంది. నా అభిమానులు ఏం చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా విధాలుగా కొత్తది. ఈ సిరీస్‌లో ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతల బృందంతో కలిసి పనిచేయడం నిజంగా అద్భుతమైన అనుభవం.. అని అన్నారు. కాగా.. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌‌లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. (Rana Naidu Web Series Telugu Trailer)

Updated Date - 2023-02-15T21:48:35+05:30 IST