OTT: ఈవారం.. థియేట‌ర్లు, ఓటీటీల్లో వ‌చ్చే సినిమాలివే

ABN , First Publish Date - 2023-11-20T12:07:27+05:30 IST

వరల్డ్ కప్ ఫీవర్ ముగియ‌డంతో థియేట‌ర్లు కాస్త ఊపిరి పీల్చుకోనున్నాయి. తెలుగు, హిందీ,ఇంగ్లీష్ భాషల్లో కలిపి 18 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఓటీటీల్లోనూ ఓ ఇర‌వై వ‌రకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ బాట ప‌డుతున్నాయి. మ‌రి ఈ వారం థియేట‌ర్లు, ఓటీటీల్లో వ‌స్తున్న చిత్రాలేంటో, అవి ఎక్క‌డ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి మ‌రి.

OTT: ఈవారం.. థియేట‌ర్లు, ఓటీటీల్లో వ‌చ్చే సినిమాలివే
OTT

వరల్డ్ కప్ ఫీవర్ ముగియ‌డంతో థియేట‌ర్లు కాస్త ఊపిరి పీల్చుకోనున్నాయి. న‌వంబ‌ర్ చివ‌రి శుక్ర‌వారం తెలుగులో అర డ‌జ‌న్, హిందీలో 10 ఇంగ్లీష్‌లో రెండు చిత్రాలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి , ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి థియేట‌ర్ల బాట ప‌ట్ట‌నున్నాయి.

ఈవారం ఓటీటీల్లోనూ సినిమాల సందడి బాగానే ఉండ‌నుంది. చిన్నా,పెద్దా క‌లిపి ఓ ఇర‌వై వ‌రకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ బాట ప‌డుతున్నాయి. అందులో చాలామందికి ఇష్ట‌మైన యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్ జోన‌ర్‌ సినిమాలే ఉండ‌డం విశేషం. మ‌రి ఈ వారం థియేట‌ర్లు, ఓటీటీల్లో వ‌స్తున్న చిత్రాలేంటో, అవి ఎక్క‌డ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి మ‌రి.

థియేట‌ర్ల‌లో

Aadikeshava Nov24 పంజా వైష్ణ‌వ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా న‌టించ‌గా మ‌ళయాళం ఫేమ‌స్ జోజు జార్జ్ ప్ర‌తినియ‌కుడిగా న‌టించిన ఆదికేశ‌వ‌,

Dhruva Natchathiram Nov24 త‌మిళ స్టార్ చియాన్ విక్ర‌మ్, తెలుగ‌మ్మాయి రీతూ వ‌ర్మ న‌టించిన, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హిచిన‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ దృవ‌న‌క్ష‌త్రం,

Kotabommali PS Nov24 శ్రీకాంత్‌, రాహుల్ విజ‌య్‌, శివానీ, వ‌ర‌ల‌క్ష్మి న‌టించిన కోట బొమ్మాళి PS ధియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నాయి.

Sound Party Nov24 బిగ్‌బాస్ విన్న‌ర్ వీజే స‌న్నీ, హ్రితిక‌, శివ‌న్నారాయ‌ణ‌లు న‌టించిన సౌండ్ పార్టీ

మాధ‌వే మధుసూద‌నా, ఫ‌ర్‌ఫ్యూమ్(Perfume ) Nov24 వంటి రెండు చిత్రాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నాయి.

హిందీలో ఈ వారం ప‌ది సినిమాల వ‌ర‌కు విడుద‌ల అవుతున్నా అందులొ కంగ‌నా రౌన‌త్‌, అనుప‌మ్ ఖేర్‌ న‌టించిన 1971 ఎమ‌ర్జెన్సీ, నెపొలియ‌న్ క‌థ‌తో వ‌స్తున్న హాలీవుడ్ డ‌బ్బింగ్ చిత్రం మాత్ర‌మే ముఖ్య‌మైన‌వి

Do Ajnabee (దో అజ్ నబీ) , Anari is Backk (అనారీ), Star fish(స్టార్ ఫిష్), Yaatris (యాత్రిస్), Fire of Love: Red, (ఫైర్ ఆఫ్ అవ్, Farrey (ఫర్రే), Manush (మనుష్), Emergency(ఎమర్జెన్సీ),Bombay (బాంబే), Napoleon(నెపోలియన్) వంటి హిందీ చిత్రాలు నవంబర్ 24న విడుదల కానున్నాయి. వీటితో పాటు Wish (విష్), Napoleon(నెపోలియన్) అనే హాలీవుడ్ చిత్రాలు విడుదల కానున్నాయి.


ఇక ఓటీటీలో

Netflix (నెట్‌ఫ్లిక్స్)

Leo in India Nov 24 Globally Nov 28 Tam, Tel, Mal, Kan, Hi

ద‌ళ‌ప‌తి విజ‌య్‌ హీరోగా, లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లియో ఈ నెల 24 నుంచి దేశ వ్యాప్తంగా విడుద‌ల కానుండ‌గా, గ్లోబ‌ల్‌గా 28 నుంచి రానుంది.

Puli mada Mal, Tel, Tam, Kan, Hin Nov 23

జోజు జార్జ్‌, ఐశ్వ‌ర్యా రాజేశ్ న‌టించిన మ‌ళ‌యాళ థ్రిల్ల‌ర్ పులిమడ న‌వంబ‌ర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Amazon Prime (అమెజాన్‌)

The Village (Series) , Tam. Tel. Kan. Mal. Hin. November 24 త‌మిళ యువ హీరో మొట్ట‌మొద‌టి సారిగా చేసిన హ‌ర్ర‌ర్‌ వెబ్ సీరిస్ ది విలేజ్‌న‌వంబ‌ర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Sony LIV (సోనీ లీవ్‌)

సంపూర్ణేశ్ బాబు న‌టించిన మార్టిన్ లూథ‌ర్ కింగ్ 29 నుంచి స్ట్రీమింగ్ జ‌రిగే అవ‌కాశం ఉంది.

Chaaver Malayalam Nov 24 రీసెంట్ మ‌ళ‌యాళ క్రైమ్ థ్రిల్ల‌ర్ చావెర్ న‌వంబ‌ర్ 24 నుంచి స్ట్రీమింగ్ జ‌రుగ‌నుంది.

ETV WIN (ఈటీవీ విన్‌)

మ‌ళ‌యాళ స్టార్ మోహ‌న్‌లాల్ నిర్మించి,న‌టించిన ఓడియ‌న్ న‌వంబ‌ర్ 24 నుంచి స్ట్రీమింగ్ జ‌రుగ‌నుంది.

Aha (ఆహ‌)

Unstoppable With NBK Nov24: హిందీ చిత్రం ‘యానిమ‌ల్’ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ర‌ష్మిక మందాన‌, సందీప్ రెడ్డితో బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - 2023-11-23T13:02:52+05:30 IST