Raj and DK: ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ నుంచి మరో వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ABN , First Publish Date - 2023-01-06T16:52:31+05:30 IST

‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) వెబ్ సిరీస్‌తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న మేకర్స్ రాజ్ అండ్ డీకే (Raj and DK). ఈ వెబ్‌సిరీస్ ఇచ్చిన కిక్‌తో మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఫర్జీ (Farzi) టైటిల్‌తో తెరకెక్కించారు.

Raj and DK: ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ నుంచి మరో వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) వెబ్‌సిరీస్‌తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న మేకర్స్ రాజ్ అండ్ డీకే (Raj and DK). ఈ వెబ్‌సిరీస్ ఇచ్చిన కిక్‌తో మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఫర్జీ (Farzi) టైటిల్‌తో తెరకెక్కించారు. షాహిద్ కపూర్ (Shahid Kapoor), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలు పోషించారు. ఈ షోకు స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో ‘ఫర్జీ’ స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 10 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఫర్జీ పోస్టర్స్‌ను కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రేక్షకులతో పంచుకుంది. ఈ వెబ్‌సిరీస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నకిలీ కరెన్సీ నోట్లతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చే గ్యాంగ్ నేపథ్యంలో వెబ్‌సిరీస్ తెరకెక్కింది. షాహిద్ కపూర్ ఈ షోతోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో ఎన్నడు కనిపించని రోల్‌లో ‘ఫర్జీ’ లో దర్శనమివ్వనున్నాడు. విజయ్ సేతుపతి ఆఫీసర్ పాత్రను పోషించాడు. నకిలీ కరెన్సీ గ్యాంగ్ ఆటకట్టించే పాత్రలో కనిపించనున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌లో కేకే. మీనన్, రాశీ ఖన్నా, భువన్ అరోరా, రెజీనా కసాండ్రా, కుబ్ర సైత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-01-06T16:56:10+05:30 IST