Mama Mascheendra: థియేటర్స్ లో విడుదలైన రెండోరోజే సుధీర్ బాబు సినిమా ఓటిటి లోకి...

ABN , First Publish Date - 2023-10-09T19:11:45+05:30 IST

సుధీర్ బాబు సినిమా 'మామ మశ్చీంద్ర' ఓటిటి లోకి వచ్చేస్తోంది. థియేటర్స్ లో విడుదలైన రెండో రోజే ఈ సినిమా ఓటిటి లో ఎప్పుడు స్ట్రీమింగ్ అనేది కూడా ప్రకటించేశారు. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే...

Mama Mascheendra: థియేటర్స్ లో విడుదలైన రెండోరోజే సుధీర్ బాబు సినిమా ఓటిటి లోకి...
A still from Mama Mascheendra

ఈమధ్య థియేటర్స్ లో విడుదలైన వెంటనే కొన్ని వారాలు ఆగితే కానీ ఆ సినిమా ఓటిటి లో విడుదలవడం లేదు. కానీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడితే కొన్ని రోజుల గ్యాప్ లోనే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో విడుదలైన ఏ సినిమా కూడా అంత తొందరగా ప్రకటించలేదు, తమ సినిమా ఎప్పుడు ఓటిటి లో వస్తుందని, కానీ సుధీర్ బాబు (SudheerBabu) సినిమా మాత్రం థియేటర్స్ లో విడుదలైన రెండో రోజే ఓటిటి విడుదల తేదీ కూడా వచ్చేసింది.

గత వారం సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటించిన సినిమా 'మామా మశ్చీంద్ర' #MamaMascheendra విడుదలైంది. ఈ సినిమాకి ప్రముఖ క్యారెక్టర్ నటుడు, రచయిత హర్ష వర్ధన్ (HarshaVardhan) దర్శకుడు. ఇందులో ఈషా రెబ్బ (EeshaRebba), మృణాళిని రవి (MrinaliniRavi) కథానాయికలుగా కనిపిస్తారు. సునీల్ నారంగ్ (SunilNarang), పి రామ్ మోహన్ రావు నిర్మాతలు. ఈ సినిమా మీద సుధీర్ బాబు చాలా అశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే క్రిటిక్స్, ప్రేక్షకులు ఒకటే తీర్పు చెప్పేసారు. ఈ సినిమా డిజాస్టర్ అని, బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది అని.

mamamascheendra1.jpg

కొన్ని సినిమాలు బాగోలేకపోయినా, నటీనటులు కొందరైనా బాగా చేశారు అని చెప్తారు, కానీ క్రిటిక్స్ ఈ సినిమా విషయంలో మాత్రం కథ, కథనం, నటీనటులు ఏ ఒక్కటీ ఈ సినిమాలో ఆసక్తిగా లేవు అని చెప్పేసారు. అందుకనే ఈ సినిమా విడుదలైన రెండో రోజే ఓటిటి లో స్ట్రీమింగ్ అవబోతోంది అని ప్రకటన వచ్చేసింది, సాంఘీక మాధ్యమాల్లో అందరూ ఈ సినిమా ఓటిటి తేదీ కూడా చెప్పేసారు.

ఇంతకీ ఈ సినిమా ఓటిటి లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతోందో తెలుసా, అక్టోబర్ 20 (October20) వ తేదీన. ఎక్కడో తెలుసా, అమెజాన్ ప్రైమ్ (AmazonPrimeVideo) లో. సుధీర్ బాబు సినిమా ఇందులో కూడా రికార్డు ఏమో అంటున్నారు కొందరు. ఎందుకంటే విడుదలైన రెండోరోజే ఈ సినిమా ఓటిటి తేదీ కూడా బయటకి వచ్చేసింది అంటే, ఎంత డిజాస్టర్ అయిందో అర్థం చేసుకోవచ్చు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-10-09T19:11:45+05:30 IST