Spy on OTT: నిఖిల్ సినిమా అప్పుడే ఓటిటి లో, ఎక్కడ ఎప్పుడు?

ABN , First Publish Date - 2023-06-29T17:31:09+05:30 IST

నిఖిల్ సిద్ధార్థ నటించిన పాన్ ఇండియన్ సినిమా 'స్పై' ఈరోజు థియేటర్స్ లో విడుదల అయింది. ఈ సినిమాని త్వరలోనే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోందని, ఎక్కడ, ఎప్పుడు అంటే..

Spy on OTT: నిఖిల్ సినిమా అప్పుడే ఓటిటి లో, ఎక్కడ ఎప్పుడు?
Nikhil Spy on OTT

ఈమధ్య చాలా సినిమాలు విడుదల అయిన కొన్ని రోజులకే ఓటిటి లో విడుదల అయిపోతున్నాయి. అయితే నిర్మాతలు ఎనిమిది (8) వారాల గడువు పెట్టుకున్నా, చాలా సినిమాలు విడుదల అయి థియేటర్స్ లో సరిగ్గా ఆడకపోవడంతో ఓటిటి లో తొందరగానే వచ్చేస్తున్నాయి. అయితే 'బలగం' #Balagam లాంటి కొన్ని సినిమాలు ఓటిటి లో వచ్చినా, థియేటర్స్ లో కూడా బాగానే చూసారు.

ఈరోజు నిఖిల్ సిద్ధార్థ (NikhilSiddhartha) నటించిన 'స్పై' #SpyMovie సినిమా విడుదల అయింది. ఈ సినిమాకి గ్యారీ బిహెచ్ (Garry Bh) దర్శకుడు కాగా, ఐశ్వర్య మీనన్ (IsaryaMenon), సాన్యా ఠాకూర్ (SanyaThakur) కథానాయికలు. రాజశేఖర్ రెడ్డి (RajasekharReddy) కథ అందించి, ఈ సినిమాని నిర్మించారు కూడా. ఈరోజు విడుదల అయిన ఈ సినిమా క్రిటిక్స్ కి అంతగా నచ్చకపోవటం ఆసక్తికరం. నిఖిల్ ఈ సినిమా మీద ఎంతగానే ఆశలు పెట్టుకున్నాడు, కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా ప్రభావం అంత ఉండకపోవచ్చు అంటున్నారు.

Nikhil-Siddhartha.jpg

ఇదిలా ఉండగా, ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో #AmazonPrimeVideo ఓటిటి హక్కులు తీసుకుంది. ఈ సినిమాని త్వరలోనే అమెజాన్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు అని తెలిసింది. అయితే ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కి ఎనిమిది వారాలు అవసరం పడదు అని, రెండు మూడు వారాల్లోనే ఓటిటి లోకి వచ్చేస్తుందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అయితే ఎప్పుడు స్ట్రీమింగ్ డేట్ అనేది త్వరలోనే ప్రకటన విడుదల చేస్తారని అంటున్నారు.

Updated Date - 2023-06-29T17:31:09+05:30 IST