OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ABN, First Publish Date - 2023-02-13T09:02:16+05:30
ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి.
ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఫిబ్రవరి 12న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
కుమిట్ 1 వారియర్ హంట్ (Kumite 1 Warrior Hunt)
కుమిట్ 1 వారియర్ హంట్ అనేది భారతదేశపు మొట్టమొదటి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ రియాలిటీ షో. భారతదేశంలోని ఈ క్రీడకు పాపులారిటీ పెంచాలనే ఉద్దేశ్యంతో వన్‌వే ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2022లో ఈ షోని ప్రారంభించింది. ఇందులో సునీల్ శెట్టి, సునంద వోంగ్, సమీర్ జాజోత్రా వంటి స్టార్స్ పాల్గొన్నారు. ఈ షో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది కూడా చదవండి : OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
స్వేర్డ్ లవ్ ఆల్ ఓవర్ ఎగైన్ (Squared Love All Over Again)
ఓ ఫేమస్ జర్నలిస్ట్, ఓ మంచి టీచర్ ప్రేమలో పడతారు. ఈ తరుణంలో వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దీని వల్ల ఆ టీచర్ వృత్తిని వదిలేసి మరో జాబ్ వెతుక్కుంటుంది. ఫిలిప్ జిల్బర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అడ్రియానా చ్లెబికా, మాటెయుస్జ్ బనాసియుక్, మికోలాజ్ రోజ్నర్స్కీ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.