OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-02-08T09:43:26+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఫిబ్రవరి 7న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

బురియల్ (Burial)

జర్మన్ నియంత హిట్లర్ సమాధి బయటికి వస్తుంది. దాన్ని మాస్కోలోని స్టాలిన్ వద్దకు తీసుకెళ్లాల్సిన పనిని రష్యా సైనికులకి అప్పగిస్తారు. ఆ అవశేషాలను తరలిస్తున్న క్రమంలో ఆ సైనికులకి ఎదురైన సంఘటనల సమాహారమే ‘బురియల్’ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మూబీలో స్ట్రీమింగ్ అవుతోంది.

burial.jpg

కపుల్ గోల్స్ సీజన్ 4 (Couple Goals Season 4)

జెన్నీ, ఆయుష్ అనే యువతీ యువకులు ఒకే కళాశాలలో చదువుతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల వల్ల వారికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అయితే వారికి ఇద్దరికీ కొన్ని కలలు ఉంటాయి. ఇద్దరు కలిసి వాటిని ఎలా సాధించారనేది ‘కపుల్ గోల్స్’ కథాంశం. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతమైన ఈ వెబ్‌సిరీస్ నాలుగో సీజన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘కపుల్ గోల్స్: లవ్ & డ్రీమ్స్’ పేరుతో తెరకెక్కిన ఈ సీజన్‌కి నిశాంత్ శర్మ దర్శకత్వం వహించాడు.

couple-goals.jpg

హోయ్‌చోయ్ (Hoichoi)

In A Relationship Phase 2 - బెంగాలీ

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Khapitar - హర్యాన్వీ

Updated Date - 2023-02-08T09:43:29+05:30 IST